కరోనా వ్యాక్సిన్ సగం పనిచేసినా చాలు, మహమ్మారిని అడ్డుకోవచ్చు

  • Published By: sreehari ,Published On : August 16, 2020 / 06:56 PM IST
కరోనా వ్యాక్సిన్ సగం పనిచేసినా చాలు, మహమ్మారిని అడ్డుకోవచ్చు

Updated On : August 17, 2020 / 2:29 PM IST

కరోనా వైరస్ అంతం చేసే వ్యాక్సిన్ 2020 ఆఖరిలో లేదా 2021 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌసీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. టీకా విడుదల ప్రక్రియ వచ్చే ఏడాదిలోపే పూర్తి చేయాలని అన్నారు. అంతకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదని చెప్పారు.



వచ్చే ఏడాది ఆరంభంలోగా వ్యాక్సిన్‌ను కచ్చితంగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. లేదంటే మరింత నష్టం వాటిల్లుతుందని హెచ్చరిచారు. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ పనిచేయకపోయినా సగం పనిచేసినా చాలు అంటున్నారు నిపుణులు.. నవంబర్ 3 నాటికి వ్యాక్సిన్ సిద్ధంగా ఉండవచ్చని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.



షాట్లు సాధారణ ప్రజలకు చేరడానికి 2021 వరకు పట్టవచ్చని ఫౌసీ అభిప్రాయపడ్డారు. రష్యా వ్యాక్సిన్‌ గురించి మాట్లాడుతూ.. ఒక వ్యాక్సిన్‌ రాగానే దానిని ప్రజలకు అందించడమే ప్రధానం కాదన్నారు.. ఎంతవరకు సురక్షితమైనదో లేదో ప్రభావవంతంగా పని చేస్తుందో చూడాలని చెప్పారు. తొలి వ్యాక్సిన్‌ను ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు వేయించారు.



ఈ వ్యాక్సిన్‌ను వ్యాధిగ్ర‌స్తుల‌కు వేయించేందుకు భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాలు అంగీక‌రించ‌డం లేదు. ర‌ష్యా వ్యాక్సిన్ వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు.. టీకాపై అనుమానాలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది.. ప్రపంచంలో అన్నిదేశాల కంటే ముందుగా తామే కరోనా
వ్యాక్సిన్ తీసుకురావడంపై అందరూ అక్కసు వెల్లగక్కుతున్నారని రష్యా విమర్శిస్తోంది..