Bangles : చేతికి గాజులు సాంప్రదాయమా!..సైంటిఫిక్ రీజన్ దాగుందా?

గాజులు వేసుకున్న వారిలో అలసటకు తక్కువగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయులు పెరగడంతో పాటు అలసట, ఒత్తిడి తగ్గటంతోపాటు, నొప్పులను భరించే శక్తి లభిస్తుంది.

Bangles : చేతికి గాజులు సాంప్రదాయమా!..సైంటిఫిక్ రీజన్ దాగుందా?

Bangles (3)

Updated On : February 15, 2022 / 3:46 PM IST

Bangles : గాజులు….మహిళలకు ఇష్టమైన ఆభరణాల్లో ఒకటి. మహిళలు చేతికి గాజులు వేసుకోవడం అనేది అనాథిగా వస్తున్న సంప్రదాయం. అందంగా అలంకరించుకోవటంతోపాటుగా చేతినిండా గాజులు వేసుకుంటారు. గాజులు సౌభాగ్యానికి సూచికగా భావిస్తారు. ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ కల్చర్ తో గాజులు వేసుకోవడాన్ని కొందరు చిన్నతనంగా భావిస్తున్నారు. మరికొందరు మహిళలు మాత్రం సాధారణ సమయాల్లో గాజులు ధరించకున్నా పండగలు, ఫంక్షన్ల సమయంలో గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పెళ్లి, సీమంతం వంటి సందర్భాల్లో చేతి నిండా గాజులు వేసి కార్యక్రమాలను నిర్వహించటం సంప్రదాయంగా వస్తుంది.

ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వెనుక కేవలం సాంప్రదాయమేనా, సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటే వివిధ పరిశోధనల ద్వారా చేతికి గాజులు వేసుకోవటం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలున్నాయని తేలింది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగడానికి చేతికి వేసుకున్న గాజులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణుల శోధనలో తేలింది. శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు. గాజులు వేసుకున్న వారిలో మణికట్టు ప్రదేశంలో రాపిడికి గురై రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. ముందుకు వెనక్కి గాజులు కదలటం వల్ల రక్త నాళాలకు మసాజ్ అవుతూ రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

గాజులు వేసుకున్న వారిలో అలసటకు తక్కువగా ఉంటుంది. శరీరంలో శక్తి స్థాయులు పెరగడంతో పాటు అలసట, ఒత్తిడి తగ్గటంతోపాటు, నొప్పులను భరించే శక్తి లభిస్తుంది. గర్భిణులకు చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యేవరకూ ఉంచుకోవాలని సూచించేవారు. గర్భం ధరించిన వారికి ఐదో నెల తర్వాత పెరిగే బిడ్డ బరువు వల్ల ఏర్పడే అలసట గాజులు వేసుకోవటం వల్ల తగ్గుతుందని నమ్మేవారు. ప్రసవం సమయంలో గాజులు చేతిపై అటుఇటు కదలటం వల్ల ప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యి శక్తి లభిస్తుంది తద్వారా నొప్పిని సైతం వారు భరించగలుగేందుకు అవకాశం ఏర్పడుతుంది.

శరీరంలో వేడిని తొలగించటంలో మట్టి గాజులు ఉపకరిస్తాయి. వీటికి వేడిని తీసుకునే గుణాన్ని కలిగి ఉంటే మట్టి గాజులు వేసుకోవడం ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యత సమస్యను ఎదుర్కొంటారు. దీనివల్ల రుతుక్రమం కూడా క్రమం సరిగా ఉండదు. గాజులు వేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతౌల్యత సమస్య తొలగిపోతుంది. గాజులు మానసిక ఆరోగ్యాన్ని, హార్మోన్లు సమతుల్యం ఉండేలా చేయటంలో దోహదపడతాయి.