Dry Fruits : అధిక మోతాదులో డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్య సమస్యలు

డ్రై ఫ్రూట్స్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అదే విధంగా చక్కెర స్ధాయి అకస్మాత్తుగా తగ్గిపోతుంది.

Dry Fruits : అధిక మోతాదులో డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్య సమస్యలు

Driedfruits

Updated On : January 10, 2022 / 5:41 PM IST

Dry Fruits : శరీరానికి తక్షణ శక్తి అందించటంలో డ్రైఫ్రూట్స్ గొప్పగా దోహదపడతాయి. డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. గుప్పెడు డ్రై ఫ్రూట్స్ రోజువారిగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చాలా మంది అదేపనిగా మోతాదుకు మించి లాగించేస్తుంటారు. అయితే అధిక మోతాదులో వీటిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అనవసరమైన ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి.

ముఖ్యంగా శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్‌ అతిగా తీసుకోవటం వల్ల శరీరంపై దుష్పప్రభావాలను చూపిస్తాయి. మోతాదుకు మించి తీసుకుంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ లో త్వరగా జీర్ణం కాని ఫైబర్ లు ఉంటాయి. వీటి వల్ల కడుపులో ఇబ్బందికరంగా ఉంటుంది. కడుపునొప్పి, మలబద్దకం సమస్య పెరుగుతుంది.

డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల బరువు వేగంగా పెరుగేందుకు అవకాశం ఉంటుంది. అధిక మోతాదులో తీసుకుంటే బరువు తగ్గడానికి బదులు పెరుగుతారు. డ్రై ఫ్రూట్స్ నుంచి వచ్చే చక్కెర దంతాలలో నొప్పి కలిగిస్తుంది. చక్కెర పంటి నొప్పితోపాటు పురుగులు ఏర్పడటానికి కారణమవుతుంది. చివరకు దంత సమస్యలకు దారితీస్తాయి.

డ్రై ఫ్రూట్స్‌లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అదే విధంగా చక్కెర స్ధాయి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీని వల్ల సృహతప్పి నీరసించి పోతారు. డ్రైఫ్రూట్స్ ను నిల్వ ఉంచేందుకు సల్ఫర్ డయాక్సైడ్ ను వాడతారు. ఇది చాలా డేంజర్. దీని వల్ల వివిధ రకాల అలెర్జీలు వస్తాయి. ఉబ్బసం సమస్యతో బాధపడేవారు డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోకుండటమే మంచిది.

కాబట్టి డ్రై ఫ్రూట్స్ ను మితంగా మాత్రమే తీసుకోవాలి. రోజులో కొద్ది మొత్తంలో తీసుకుంటే వాటి నుండి మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలా కాకుండా అదే పనిగా వాటిని తీసుకుంటే మాత్రం అనవసరమైన శారీరక ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది.