Sunday Holiday : సండే హాలీ డేగా ఎంజాయ్ చేస్తాం .. దీని వెనుక నారాయణ్ మేఘాజీ లోఖండే పోరాటం ఉందని మీకు తెలుసా?
ఆదివారం అంటే అందరికీ ఇష్టం. హాలీ డే.. జాలీ డే.. అయితే ఈ రోజు సెలవు దినంగా ఎవరు డిక్లేర్ చేశారు. దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? దీని కోసం ఎవరు పోరాటం చేశారు? మీకు తెలుసా?

Sunday Holiday :
Sunday Holiday : వారం మొత్తంలో సండే అంటే అందరికీ చాలా ఇష్టం. వారం అంతా కష్టపడిన ఉద్యోగులకు ఆ రోజు సెలవు దొరుకుతుంది. ఇక చదువుకునే వారికి ఆరోజు కాస్త సరదా రోజు. ఇక ఎవరు ఏమి ప్లాన్ చేసుకున్నా సండే రోజునే ప్లాన్ చేసుకుంటారు. అందరి మనసులో సండే అంటే కాస్త రిలాక్స్ అయ్యే రోజుగా మనసులో ముద్ర పడిపోయింది. సండేని ఎంజాయ్ చేస్తున్నాం సరే.. కానీ ఈరోజు అసలు హాలీడేగా ఎందుకు డిక్లేర్ చేసారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక చరిత్ర ఉంది.
పురుషులే లేని గ్రామం..మహిళలకు పిల్లలెలా పుడతారు?సంబురు తెగ చరిత్ర
7 మార్చి, 321 న మొదటి రోమన్ పాలకుడైన కాన్‌స్టాంటైన్ చక్రవర్తి ఆదివారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారట. ఆ రోజు ప్రజలంతా చర్చిలకు హాజరవుతారని అలా నిర్ణయం తీసుకున్నారట. ఇంటర్నేషనల్ స్టాండర్డైజేషన్ ఆర్గనైజేషన్ ISO ప్రకారం ఆదివారం వారంలో చివరి రోజుగా పరిగణించబడుతుంది.. దీంతో మొదటి రోమన్ చక్రవర్తి ఆదివారం విశ్రాంతి దినంగా పాటించాలని ప్రకటించాడట. అయితే 1890 జూన్ 10 న బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది. 1844 లో బ్రిటీష్ గవర్నర్ జనరల్ స్కూలుకి వెళ్లే విద్యార్ధుల కోసం ఆదివారం సెలవు నిబంధనను అమలు చేశారట.
Azadi ka Amrutotsavam : తొలి తరం మహిళా స్వాతంత్య్ర యోధురాలు బేగం హజ్రత్ మహల్
నిజానికి బ్రిటీషు వారు భారతదేశానికి వచ్చినపుడు ఇక్కడ ఆదివారం సెలవు లేదు. మిల్లుల్లో పనిచేసే కార్మికులు ఏడు రోజులు పని చేస్తూ ఉండేవారట. బ్రిటీషు వారు మాత్రం ఆదివారం సెలవు తీసుకుని చర్చికి వెళ్తుండేవారట. మిల్లు కార్మికుడైన నారాయణ్ మేఘాజీ లోఖండే ఆదివారం సెలవు దినం కావాలని పోరాటం చేశారు. 7 సంవత్సరాల ఆయన సుదీర్ఘ పోరాటం తర్వాత 1890 జూన్ 10 న బ్రిటీష్ ప్రభుత్వం భారతీయ కార్మికులకు ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది. అలా ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడటం వెనుక నారాయణ్ మేఘాజీ లోఖండే అవిశ్రాంత పోరాటం ఉంది.
చాలా దేశాలు ఆదివారం సెలవు దినంగా.. విశ్రాంతి దినంగా పాటిస్తున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం వారం ఆదివారంతో మొదలవుతుంది. ఇది సూర్య భగవానుడి రోజు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యుడు, ఇతర దేవతలను ఈరోజు పూజిస్తారు. చాలా ముస్లిం దేశాలలో శుక్రవారం ఆరాధన దినంగా పాటిస్తారు. ఆ కారణంతో అక్కడ ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు దినంగా పాటిస్తారు.