పురుషులే లేని గ్రామం..మహిళలకు పిల్లలెలా పుడతారు?సంబురు తెగ చరిత్ర

  • Published By: nagamani ,Published On : September 29, 2020 / 02:15 PM IST
పురుషులే లేని గ్రామం..మహిళలకు పిల్లలెలా పుడతారు?సంబురు తెగ చరిత్ర

men are not allowed in this village named umoja in kenya Only ladies : పురుషుల నుంచి తీవ్రమైన హింసలు..అవమానాలు..అణచివేతలు..అత్యాచారాలు ఇలా ఘోరమైన బాధలు అనుభవించిన మహిళలు ఓ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఓ గ్రామాన్నే సృష్టించుకున్నారు. ఆ గ్రామంలో కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. వారి మాత్రమే అక్కడ నివసిస్తారు.

 

పురుషులకు ఆ గ్రామంలో నివసించే అవకాశం లేదు. భర్తలద్వారా ఇతర పురుషుల ద్వారా అత్యాచారాలకు..హింసలకు..అవమానాలకు గురైనవారు..దిక్కులేక అల్లాడే మహిళలు ఈ గ్రామంలో నివసిస్తుంటారు. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన కెన్యా దేశంలోని ఆ గ్రామం పేరు ‘ఉమేజా’. ఈ గ్రామంలో నివసించే మహిళలంతా ఉత్తర కెన్యాలోని సంబురు వర్గానికి చెందిన వారు.

లైంగిక దురాచారాలకు బలైన పడతుల వెతలు
సంబు వర్గంలోని ప్రతి కుటుంబంలోని మహిళలకు ఎటువంటి హక్కులు ఉండవు. పురుషులకు బానిసల్లా బతకాలి. మహిళల్ని కేవలం పురుషుల లైంగిక కోరికను తీర్చడానికి, పిల్లల్ని కనడానికి మాత్రమే ఉపయోగించేవారు. కుటుంబంలోని పురుషుల నుంచే కాకుండా ఈ కెన్యా మహిళలు బ్రిటిష్ సైనికులచే ఎన్నో లైంగిక వేధింపులకు గురయ్యారు.

 

అలా అత్యాచారాలకు గురైనవారిని భర్తలు వదిలేసేవారు. తిండి లేక అలమంటించేవారు. ఆకలితో చచ్చిపోయినవారుకూడా ఉన్నారు.భర్తల వద్ద కూడా రక్షణ లేక అకృత్యాలకు గురైన మహిళలంతా కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అదే ‘ఉమోజా’ గ్రామం.

men are not allowed in this village named umoja in kenya Only ladies

పురుషులకు అనుమతి లేని ‘ఉమోజా’
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉమోజాలో పురుషులకు నివసించేందుకు అనుమతి లేదు. కానీ మహిళలకు పుట్టిన పిల్లలు మాత్రం అంటే మగపిల్లకు 18ఏళ్ల వచ్చేంత వరకూ ఇక్కడ ఉండవచ్చు. తరువాత వాళ్లు ఉమోజా గ్రామాన్ని విడిచి బైటకు వెళ్లిపోవాల్సిందే. కాగా..పురుషులు లేని ఈ ఉమోజా గ్రామంలో మహిళలు గర్భవతులు ఎలా అవుతున్నారు? అనే ప్రశ్న తప్పకుండా వస్తుంది.

ఆడపుట్టుకపై అంతులేని వివక్ష..హింస
​ఉమోజా గ్రామం చరిత్రలోకి వెళితే..సబురు మహిళలు గురైన తీవ్రమైనహింసకు సుదీర్ఘ చరిత్ర ఉంది. వారి వారి ఇళ్లల్లోనే ఆడపుట్టుక పుట్టినవారంతా హింసను ఎదుర్కొన్నవారే. పురుషుల ఆధిపత్యం అధికంగా..దారుణం.ఆడవారు కేవలం భర్తలకు సంతానోత్పత్తి చేసే యంత్రాలుగా మాత్రమే చూసేవారు. నోరెత్తి మాట్లాడకూడదు. ఇంటి పురుషులతోనే కాక..
1990ల ప్రారంభంలో ఇక్కడి మహిళలు బ్రిటిష్ సైనికుల దారుణమైన లైంగిక వేధింపులకు బలైనవారే.

వందలకొద్దీ కెన్యా మహిళలు అత్యాచారాలకు బ్రిటీషు సైనికుల చేతిలో అసహజలైంగిక దారుణ హింసలకు బలైయ్యారు. దీంతో భర్తలు వారిని మానసికంగా శారీకరంగా మరింత హింసకు గురి చేసి..ఇళ్ల నుండి బైటకు గెంటేశారు. తరువాత వారి కష్టాల గురించి వింటేనే ఒళ్లు గగొర్పొడుస్తుంది.వారికి ఎవ్వరూ తినటానికి తిండే కాదు తాగటానికి నీరుకూడా ఇవ్వకూడదు.వారి వంక చూడకూడదు..మాట్లాడకూడదు..అసలు ఆ గ్రామాల్లోనే ఉండకూడదు.

​ఉమోజా గ్రామం ఆవిర్భావం చరిత్ర
హింసలకు గురైన మహిళల కోసం మహిళలే నిర్మించుకున్న ప్రత్యేకమైన గ్రామం ఉమోజా. ఇళ్ల నుండి గెంటివేయబడిన మహిళలు..ఒంటరి మహిళలు ఇలా ఎన్నో వివక్షలకు ఘోరమైన హింసలకు గురైన ఆడవాళ్ల కోసం ‘రెబెకా’ అనే మహిళకు ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. రెబెకా ఇచ్చిన చైతన్యంతో ఆమె నాయకత్వంలో అకృత్యాలను ఎదుర్కొన్న మహిళలంతా కలిసి అనేక విప్లవాలను తీసుకువచ్చారు.

 

పురుషులు ఆక్రమించిన తమ అనేక భూములను తిరిగి తీసుకున్నారు. తమకంటూ ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఆ భూముల్లో వ్యవసాయం చేస్తారు. కూరగాయలు పండిస్తారు. అంతేకాదు ఈ మహిళల చేతిలో రూపు దిద్దుకునే విభిన్నమైన డిజైన్ల ఆభరణాలు చూస్తే వీళ్లే తయారు చేశారా? లేక ప్రముఖ డిజైనర్లు తయారు చేశారా? అనిపిస్తుంది.అంత అందమైన ఆభరణాలు తయారు చేయటంలో నైపుణ్యం సాధించారు ఉమోజా గ్రామ మహిళలు. వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి సృష్టించుకున్నారు.



1990లో స్థాపించబడిన ​ఉమోజా
1990లో ఉమోజా కెన్యాలో స్థాపించబడిన ఈ గ్రామం ఉమోజా. దేశ రాజధాని నైరోబి 380 కిలోమీటర్ల దూరంలోని సంబురు కౌంటీలోని ఆర్చర్స్ పోస్ట్ పట్టణానికి సమీపంలో ఉంది. ఉమోజాలో మహిళలు మట్టి పేడతో కలిపి చిన్న గుడిసెలు నిర్మించుకున్నారు. రక్షణ కోసం గుడిసెల చుట్టూ ముళ్ల కంచెలు నిర్మించుకున్నారు. సంబురు మహిళలు పేదరికం..అణచివేతల నుండి బైటపడి అభివృద్ది చెందేందుకు నిరంతరం కష్టపడుతుంటారు. ఇళ్ల నుండి గెంటివేయబడ్డ మహిళలకు, అనాధలకు, అత్యాచారాలకు గురైన వారికి, భర్త లేని ఒంటరి మహిళలకు ఈ గ్రామంలో రక్షణనిస్తారు.



​పురుషులు లేకుండా వారికి పిల్లలెలా పుడతారు? అనేది పెద్ద ప్రశ్న
ఉమోజా గ్రామంలో పురుషులకు ప్రవేశం ఉంటుంది.కానీ వారు ఇక్కడ నివసించడానికి అనుమతి లేదు. ఉమోజా గ్రామ మహిళలు ఏ పురుషుడినైనా ఇష్టపడితే వారు ఇక్కడకు రావచ్చు. కానీ శాశ్వతంగా ఉండకూడదు. వచ్చి వెళ్లిపోవాల్సిందే. అలా వారికి గర్భం వస్తే ఆడపిల్లను ప్రసవిస్తే ఆఆడపిల్ల పెద్దయ్యాక ఇక్కడే ఉండవచ్చు. కానీ మగపిల్లాడు పుడితే మాత్రం వారికి 18ఏళ్ల వచ్చేవరకూ మాత్రమే ఇక్కడ ఉండాలి. ఆ తరువాత వారు ఊరిని వదిలి బైటకు వెళ్లిపోవాల్సిందే.

 

2005లో ఉమోజాలో 30 మంది మహిళలు, 50 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పు మహిలు 60మంది దాటారు. అలాగే పిల్లలు 200కు పైగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మహిళలు ఈ గ్రామం నుంచి వెళ్లిపోయి కుంటుంబాలను ఏర్పరచుకోవాలంటే వెళ్లిపోవచ్చు.

ఉమోజా మహిళల ​జీవన విధానం
ఉమోజాలో మహిళల ప్రధాన జీవనోపాధి హస్తకళలు. వాటిని తయారు చేసి సిటీకి తీసుకెళ్లి అమ్ముతుంటారు. ఉమోజా వాసో మహిళా సాంస్కృతిక కేంద్రంలో హస్తకళలను విక్రయిస్తారు. ఎక్కడా చూడని విభిన్నమైన హస్తకళ వస్తువులను తయారు చేయటంతో ఉమోజా మహిళలు సిద్ధహస్తులని చెప్పటంలో అతిశయోక్తి లేదు. విదేశీ టూరిస్టులను వీరు తయారుచేసిన వస్తువులను..ఆభరణాలకు ఇష్టంగా కొనుక్కుంటారు.



ఉమోజా గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు‘బీరు’
ఉమోజా గ్రామస్తుల ప్రధాన ఆదాయ వనరు‘బీరు’. వారు తయారు చేసే బీరు చాలా టేస్ట్ గా ఉంటుంది. ఆ బీరుతో పాటు వారు తయారు చేసే పదార్ధాలు కావాలంటే ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.



ఈ గ్రామంలో నివసించే మహిళలంతా వారి ఆదాయంలో 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని గ్రామంలో పిల్లల కోసం విద్యా సంస్థలను నడిపేందుకు ఉపయోగించుకుంటారు.