Birthday Candles : బర్త్ డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారో తెలుసా?

పుట్టినరోజు నాడు కేక్ కట్ చేస్తాం. కొందరు దీపాలు ఊదడం సెంటిమెంట్‌గా భావించి ఊదటానికి ఇష్టపడరు. కానీ.. చాలామంది కేక్‌పైన ఉన్న క్యాండిల్స్‌ని ఊదుతారు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా?

Birthday Candles : బర్త్ డే నాడు క్యాండిల్స్ ఎందుకు ఊదుతారో తెలుసా?

Birthday Candles

Updated On : July 16, 2023 / 4:29 PM IST

Birthday Candles : పుట్టినరోజును వేడుకగా జరుపుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్యలో కేక్ కట్ చేస్తారు. వాటిపై క్యాండిల్స్ ఉంచి ఊదుతారు? అలా ఎందుకు చేస్తారు?

Pune : కారుపై కూర్చుని కత్తితో బర్త్ డే కేక్ కట్ చేశాడు.. బర్త్ డే బోయ్ కోసం వెతుకుతున్న పోలీసులు

పుట్టినరోజు నాడు కొవ్వొత్తులను ఊదడం అనేది శతాబ్దాలుగా వస్తోంది. అయితే వాటిని ఎందుకు ఊదుతున్నారో చాలామందికి తెలియదు. పుట్టినరోజు నాడు కేక్ కట్ చేయడం అనే సంప్రదాయం మధ్య యుగాలలో ముఖ్యంగా జర్మనీలో పుట్టిందని చెబుతారు. అక్కడి పిల్లలతో ప్రారంభమైంది అని నమ్ముతారు. ఈ వేడుకనే ‘కిండర్ ఫెస్ట్’ అంటారు. అప్పట్లో బర్త్ డే కేక్స్ ఇప్పటిలా ఉండేవి కావట. బ్రెడ్‌కి దగ్గరగా ఉండేవట. మొత్తానికి పుట్టినరోజు కేకులను ఉపయోగించిన మొదటి దేశం జర్మనీ అయితే, కొవ్వొత్తులను ఉపయోగించినది పురాతన గ్రీకులట. గ్రీకు దేవత చిహ్నంగా క్యాండిల్స్ వెలిగించేవారట.

 

గ్రీకుల దేవత ఆర్టెమిస్..ఆమెను గ్రీకులు ఆరాధించేవారట. ఆమెను పూజించేటపుడు గుండ్రని కేకుపై క్యాండిల్స్ వెలిగించేవారట. గ్రీకులు తయారు చేసిన కేక్‌లు గుండ్రంగా చంద్రుని ఆకారం పోలి ఉండేవట. క్యాండిల్స్ నుంచి వచ్చే వెలుగు చంద్రుని ప్రకాశానికి ప్రతీకగా భావించేవారట. క్యాండిల్స్ ఊదే ముందు ప్రార్ధనలు చేసేవారట. ఇక అసలు విషయం అంతా క్యాండిల్స్ ఊదిన తరువాత వచ్చే పొగలోనే ఉంది.

Adulterated Cake Mafia : కేక్ లవర్స్ బీకేర్ ఫుల్.. ఇవి తింటే ప్రాణాలకే ప్రమాదం..! పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

క్యాండిల్స్ ఊదినపుడు పొగ పైకి వెళ్తుంది.. ఈ పొగను గ్రీకులు పవిత్రంగా భావించేవారట. ఎందుకంటే వారు ఏవైతే కోరికలు కోరుకుంటూ ప్రార్థనలు చేస్తారో అవి పొగద్వారా తమ దేవత అయిన ఆర్టెమిస్‌కు చేరతాయని.. అలా తమ కోరికలు నెరవేరతాయని నమ్మేవారట. అందుకే పుట్టినరోజు నాకు కేక్ కట్ చేసిన తరువాత క్యాండిల్స్ ఊదడం అనేది అలవాటుగా వస్తోంది. ఇదీ పుట్టినరోజు నాడు క్యాండిల్స్ ఊదడం వెనుక దాగి ఉన్న కథ.