Holi 2025 Tips : హోలీ రోజున కెమికల్ కలర్లతో జాగ్రత్త.. మీ హెయిర్ దెబ్బతినకుండా ఇలా కాపాడుకోండి!

Holi 2025 Tips : ప్రస్తుతం మార్కెట్లో లభించే చాలా కలర్లలో చర్మాన్ని మాత్రమే కాకుండా జుట్టును కూడా నిర్జీవంగా మార్చే కెమికల్స్ ఉంటాయి. హోలీ రోజున జుట్టును రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.

Holi 2025 Tips : హోలీ రోజున కెమికల్ కలర్లతో జాగ్రత్త..   మీ హెయిర్ దెబ్బతినకుండా ఇలా కాపాడుకోండి!

Holi 2025 Tips

Updated On : March 3, 2025 / 12:29 AM IST

Holi 2025 Tips : హోలీ పండుగ త్వరలో వచ్చేస్తోంది. హోలీ రంగుల పండుగ రోజున చాలా మంది రంగులతో ఆడుకోకపోతే హోలీ వేడుక అసంపూర్ణమని భావిస్తారు. మరికొందరు రంగులకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. మీరు కూడా హోలీ రోజున రంగులతో తడిసిపోతే.. మీ చర్మంతో పాటు మీ జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.

చాలా మంది తమ చర్మాన్ని రంగుల వల్ల కలిగే నష్టం నుంచి రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ, కెమికల్ కలర్లు కూడా మీ జుట్టుకు చాలా నష్టాన్ని కలిగిస్తాయి. సిల్కీ-మృదువైన జుట్టు కూడా నిర్జీవంగా గజిబిజిగా మారుతుంది. కొన్ని ఇంటి చిట్కాల సాయంతో హోలీ రోజున మీ జుట్టును కెమికల్ కలర్ల నుంచి రక్షించుకోవచ్చు.

Read Also : SBI Mutual Fund : మీరే కాదు.. మీ పిల్లల పాకెట్ మనీతో SIPలో ఇన్వెస్ట్ చేయొచ్చు.. కేవలం రూ. 250తో 20ఏళ్లలో ఎంత డబ్బు చేతికి వస్తుందంటే?

అబ్బాయిలు కూడా జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, అమ్మాయిలు ముఖ్యంగా తమ జుట్టును సిల్కీగా ఉంచుకోవడానికి ఖరీదైన ఉత్పత్తుల నుంచి ఇంటి చిట్కాల వరకు ప్రతిదీ ప్రయత్నిస్తారు. హోలీ రోజున కొంచెం అజాగ్రత్తగా ఉంటే.. మీ అందమైన జుట్టు దెబ్బతింటుంది. మీ కష్టమంతా వృథా అవుతుంది. హోలీ రోజున జుట్టును రంగుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీ జుట్టును వదిలేసి ఉంచవద్దు :
ఇది ట్రెండీ రీల్స్ యుగం.. చాలా మంది హోలీ రోజున కూడా తమ జుట్టును వదిలేస్తారు. కానీ, మీ జుట్టుకు ఎక్కువ నష్టం జరుగుతుంది. మీ జుట్టును వదలకుండా ఏదైనా క్లిపుతో కట్టుకోండి. హోలీ పార్టీలో తలపై టోపీ ధరించడం మర్చిపోవద్దు. మీ జుట్టును రంగుల నుంచి చాలా వరకు సురక్షితంగా ఉంచుతుంది.

మీ జుట్టుకు నూనె రాయండి :
హోలీ ఆడే ముందు మీ జుట్టుకు నూనె రాసి జడ వేయండి. నూనెలో నిమ్మరసం కలిపి రాసుకోవడం మంచిది. మీరు ఆవాలు, బాదం, కొబ్బరి లేదా ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. రంగులతో ఆడుకునేటప్పుడు నీటి రంగులు మీ తలపై పడకుండా చూసుకోండి.

మీ జుట్టుపై ప్రొటెక్షన్ లేయర్ క్రియేట్ చేయండి :
హోలీ రోజున మీ జుట్టును రంగుల నుంచి రక్షించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ప్రొటెక్ట్ లేయర్ క్రియేట్ చేయడమే. అంటే.. పండుగకు ముందు రోజు రాత్రి మీ జుట్టుకు కండిషనర్ రాయాలి. ఆపై ఆయిల్ రాసుకోండి. మీ జుట్టు మీద ఈ ప్రొడక్టుల లేయర్ ఏర్పడుతుంది. దాంతో మీ హెయిర్ రంగుల కారణంగా పెద్దగా దెబ్బతినదు. మీ జుట్టు సిల్కీగా కూడా ఉంటుంది.

Read Also : Ramadan 2025 : ఉపవాసం తర్వాత ఇఫ్తార్ సమయంలో ఈ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. లేదంటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు తప్పవు!

ఈ చిట్కాలు పాటించండి :
హోలీ ఆడిన తర్వాత కఠినమైన షాంపూలను వాడొద్దు.. మీ జుట్టును కడిగిన తర్వాత బాగా కండిషన్ చేయండి. మీ జుట్టు చాలా గజిబిజిగా మారితే పండిన అరటిపండు, పెరుగును కలబంద జెల్‌లో కలిపి పేస్ట్‌లా చేసి జుట్టుకు అప్లై చేయండి. 20 నిమిషాల నుంచి 25 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. దాంతో మీ జుట్టు మృదువుగా మారుతుంది.