Home Tips : చలికాలంలో చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు పొగొట్టే ఇంటి చిట్కాలు!

వంటగదిలో కనిపించే అత్యంత శక్తివంతమైన పదార్ధాలలో తేనె ఒకటి. ఇది చర్మాన్ని తేమనిస్తుంది. కొబ్బరి నూనె లేదా ఇతర నూనెతో కలిపి దీనిని జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు మంచి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది.

Home Tips : చలికాలంలో చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు పొగొట్టే ఇంటి చిట్కాలు!

Home tips to get rid of skin and hair related problems in winter!

Home Tips : చలి కాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తుంటాయి. దురద, పొడి, నిస్తేజమైన చర్మం కారణంగా జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మం, జుట్టును రక్షించుకోవడం శీతాకాలంలో చాలా ముఖ్యమైనది. అనేక ఆరోగ్య,చర్మం,జుట్టు సమస్యలు వస్తుంటాయి. చలి ఎక్కువగా ఉండటం వల్ల , చర్మం పొడిగా మారి దురద, మంట కలిగిస్తాయి. తలలో చుండ్రు, జుట్టు పొడిబారి ఎండు గడ్డిలా తయారవుతుంది. ఇలాంటి సమస్యలకు కొన్ని ఇంటి చిట్కాలతో చెక్ పెట్టొచ్చు.

1. కొబ్బరి నూనె ; చలికాలంలో కొబ్బరినూనె కలిగించే ప్రయోజనాలు అన్ని ఇన్ని కాదు. గోరువెచ్చని కొబ్బరినూనెను పొడిబారిన, డల్ గామారిన జుట్టుకు అప్లై చేస్తే చాలా మంచిది. కొబ్బరినూనె చర్మాన్ని రక్షించే ఫ్యాటీ యాసిడ్స్‌తో సమృద్ధిగా నిండి ఉంటుంది. చర్మం ఎండిపోయినట్లు కనిపిస్తే కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి. అంతేకాకుండా పగిలిన మడమలకు రాస్తే అద్భుత ఫలితాలు ఉంటాయి.

2. అలోవెరా ; చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణలో కలబంద పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిలో విటమిన్ E, C, బీటా-కెరోటిన్‌తో సమృద్ధిగా ఉంటాయి. శీతాకాలంలో పొడి, దెబ్బతిన్న చర్మాన్ని, స్కాల్ప్‌ను సులభంగా పునరుద్ధరించటంలో సహాయపడుతుంది.

3. తేనె ; వంటగదిలో కనిపించే అత్యంత శక్తివంతమైన పదార్ధాలలో తేనె ఒకటి. ఇది చర్మాన్ని తేమనిస్తుంది. కొబ్బరి నూనె లేదా ఇతర నూనెతో కలిపి దీనిని జుట్టుకు అప్లై చేస్తే జుట్టుకు మంచి మాయిశ్చరైజ్ గా పనిచేస్తుంది. పగిలిన, ఎండిన పెదవులకు అప్లై చేస్తే పగలటాన్ని నివారిస్తుంది.

4. పాలు ; చర్మం, జుట్టు కోసం సంరక్షణ కోసం చలికాలంలో పాలును తీసుకోవచ్చు. ముఖంపై పచ్చి పాలని అప్లై చేస్తే ముఖం మంచి గ్లో గా మారుతుంది. జుట్టుకు అప్లై చేస్తే ప్రీ-కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. మెరిసే, మృదువైన చర్మం కోసం ముఖానికి పాలు, తేనే కలిపి అప్లై చేసి 20 నిమిషాలు ఉండనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

5. అరటి ; అరటిపండు గుజ్జుతో జుట్టుకు హెయిర్ మాస్క్‌ వేసుకోవటం వల్ల జుట్టు ప్రకాశవంతంగా మారుతుంది. షాంపూలు, కండీషనర్‌లతో సహా సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడంలో అరటిపండును కచ్చితంగా ఉపయోగిస్తారు. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తూ శుభ్రం చేయడానికి ఇది సహాయపడుతుంది. అరటిపండు గుజ్జును తేనెతో మిక్స్ చేసి ముఖానికి ఫేస్ ప్యాక్‌ వేసుకోవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా కనిపిస్తుంది.