మనకు కరోనా వ్యాక్సిన్.. ఇంత వేగంగా ఎలా వచ్చిందంటే?

మనకు కరోనా వ్యాక్సిన్.. ఇంత వేగంగా ఎలా వచ్చిందంటే?

Updated On : December 19, 2020 / 2:17 PM IST

How did we get a vaccine so fast : ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో మునిగిపోయింది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? ప్రపంచమంతా ఆశగా ఎదురుచూసింది. కేవలం ఏడాదిలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఇదేలా సాధ్యమైంది. సాధారణంగా ఒక టీకా రావాలంటే కొన్నేళ్ల సమయం పడుతుంది. అలాంటిది ఇంత తక్కువ వ్యవధిలో అందులోనూ ఏడాదిలోనే కరోనా టీకా వేగంగా వచ్చేసింది. కరోనావైరస్ సంక్షోభానికి ముందు పరిశీలిస్తే.. 60వ దశకంలో గవదబిళ్ళ వ్యాధిని నివారించడానికి ఒక టీకాను వేగంగా అభివృద్ధి చేశారు.

ఆ టీకాకు నాలుగు ఏళ్ల సమయం పట్టింది. అయితే, SARS-CoV-2కు వ్యాక్సిన్‌ ను అత్యంత వేగంగా ఏడాదిలోనే అభివృద్ధి చేశారు. ఇంతకు మునుపు ఇంత త్వరగా టీకా అభివృద్ధి చేసినా దాఖలాలే లేవు.ఒక వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది మార్కెట్లోకి అందుబాటులోకి రావాలంటే దాని వెనుక చాలా ప్రాసెస్ ఉంటుంది. పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతుంది. వ్యాక్సిన్ అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చడమే పెద్ద అడ్డంకిగా చెప్పవచ్చు.

కానీ మహమ్మారి సమయంలో అలా జరగలేదు. ఎందుకంటే అపారమైన మార్కెట్, వ్యాక్సిన్ కు అపూర్వమైన డిమాండ్ ఉన్న కారణంగా అతి తక్కువ సమయంలోనే వ్యాక్సిన్ అభివృద్ధి వేగంగా జరిగింది. అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూరేలా ప్రేరేపించాయి. ఇదే వ్యాక్సిన్ అత్యంత వేగంగా అందుబాటులోకి రావడానికి దారితీసింది.

వ్యాక్సిన్ల అభివృద్ధి విధానం ఎంతో ప్రామాణికం:
సాధారణంగా.. ఒక వ్యాక్సిన్ అభివృద్ధి జరిగి అది ప్రజలకు అందుబాటులోకి రావాలంటే ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అనేక ట్రయల్స్ జరగాల్సి ఉంటుంది. అందుకు చాలా ఏళ్ల సమయమే పడుతుంది. క్లినికల్ ట్రయల్స్‌ దిశకు చేరుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది.

ట్రయల్స్ మూడు దశల్లో జరుగుతాయి. ఆ తరువాత నియంత్రణ సమీక్ష, ఆపై తయారీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కానీ ట్రయల్ దశలు, తయారీ భద్రతలో రాజీ పడకుండా సమయాన్ని ఆదా చేయడంలో జాప్యం ఏర్పడొచ్చు. ఇలోగా వైరస్ వ్యాప్తి మరింత పెరిగిపోవచ్చు.

గతంలో కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన SARS-CoV, MERS-CoV వరుసగా 2002, 2012లో ఉద్భవించాయి. ఈ వైరస్ జన్యువుల ఆధారంగా శాస్త్రవేత్తలు సైతం రీసెర్చ్ చేయడానికి సాయపడింది. ఇక mRNA వ్యాక్సిన్లు కూడా ఒక దశాబ్దానికి పైగా అధ్యయనం చేశారు.

మొదటి హ్యుమన్ ట్రయల్స్ 2013లో ప్రారంభమయ్యాయి. అప్పటి వ్యక్తులకు సంబంధించి ట్రయల్ డేటా రెండు నెలల వరకు మాత్రమే ఉండొచ్చు. అదే ఇప్పడు అయితే.. ఫైజర్ వ్యాక్సిన్, శాస్త్రవేత్తలు ప్రజలను ట్రాక్ చేస్తున్నారు.

ప్రయోగాత్మక mRNA ఔషధాలను ఎలా పనిచేస్తాయో ముందుగానే పరీక్షిస్తున్నారు. 2020 జనవరిలోనే చైనా ఈ కొత్త వైరస్ వివరాలకు సంబంధించి సమాచారాన్ని ప్రపంచానికి షేర్ చేసింది.

అప్పటికప్పుడు అమెరికా, యూకేలోని స్వతంత్ర రెగ్యులేటరీ సంస్థలు సంయుక్తంగా వ్యాక్సిన్ ఆమోద ప్రక్రియలో సహకరించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యాక్సిన్ అభివృద్ధి వేగవంతంగా అందుబాటులోకి రావడానికి ప్రపంచవ్యాప్తంగా సమిష్టి కృషితోనే సాధ్యపడింది.