Peanuts : పల్లీ ఉండలు తింటే…ఆరోగ్యానికి మేలే?
ఆకలి తీర్చి, శరీరానికి కావాల్సిన శక్తినీ, బలాన్నీ ఇస్తాయి.రక్తహీనత దూరమవుతుంది. వేరుశనగల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు, బెల్లంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి.

Peanuts
Peanuts : వేరుశనగ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గింజలకు బెల్లాన్ని చేర్చి ఉండలుగా తయారు చేసుకుని చాలా మంది తింటుంటారు. తియ్యగా, ఎంతో రుచినిచ్చే ఈ ఉండలను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలు గా పిలుస్తుంటారు. పల్లీ ఉండలు, వేరుశనగ ముద్దలు, పల్లీ ఉండలు, పల్లీ చక్కీలు,పప్పుండలు ఇలా రకరకాల పేర్లతో పిలిచే ఈ వేరుశనగ ఉండలు శరీరానికి బలాన్నిస్తాయి. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్ధాల్లో ఈ ఫల్లీ ఉండలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
ఆకలి తీర్చి, శరీరానికి కావాల్సిన శక్తినీ, బలాన్నీ ఇస్తాయి.రక్తహీనత దూరమవుతుంది. వేరుశనగల్లో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లు, బెల్లంలో ఐరన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి. శరీరంలో రక్తప్రసరణ కూడా మెరుగవుతుంది. పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల రక్తహీనత దూరమవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బెల్లం, వేరుశనగలను కలిపి తినడం వల్ల మహిళల్లో రుతు సమస్యలకు ఉపశమనం పొందవచ్చు. పల్లీలు తినడం వల్ల శరీరంలో సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. వేరుశెనగలోని అన్ శాచురేటెడ్ ఫ్యాట్ గుండె ఆరోగ్యంగానికి దోహదం చేస్తుంది.
పల్లీలో ఉండే పీచు పదార్థాలు ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిస్తుంది. బెల్లం, వేరుశనగల్లో ఉండే కాల్షియం, ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు ధృఢంగా తయారవుతాయి. ఫల్లీ ఉండలను తినటం వల్ల వాటిల్లో లభించే సెలీనియం, మెగ్నీషియం, ఐరన్ కలిసి పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. పల్లీల్లోని ప్రత్యేక పోషకాలు శరీరంలోని చెడు కొవ్వుని తగ్గించి.. మంచి కొవ్వుని పెంచుతాయి. వేరుశనగల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. అయితే వీటిని మితంగానే తీసుకోవాలి. ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటుగా మలబద్ధక సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది.