Mint Leaves : పుదీనాలో ఔషదగుణాలు తెలిస్తే!…
పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.

Mint Leaves
Mint Leaves : పుదీనా ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. ఆయుర్వేద వైద్యంలో ఇది ఎంతో విలువైన మొక్క. చూడడానికి ఎంతో విలక్షణంగా ఉండి, దీని ఆకులు మందంగా, మృధువుగా ఉంటాయి. ఆకుపచ్చని రంగులో ఉంటాయి. పుదీనా యొక్క తాజా ఆకులు ప్రత్యేకమైన సుగంధ వాసనలను వెదజల్లుతాయి. దీనిని వివిధ రకాల వంటకాల్లో వాడతారు. పుదీనాతో తయారు చేసిన నూనె సుగంధభరితంగా ఉంటుంది. దీనిని టూత్‌పేస్ట్, షాంపూలు, సబ్బులలో కూడా సువాసన కోసం వినియోగిస్తారు. గ్రీన్ టీ, స్వీట్ టీ, పుదీనా ఆకులు వేస్తుంటారు. పుదీనాలో ఉన్న ఔషదగుణాల విషయానికి వస్తే…
పుదీనా జీర్ణ సంబంధ వ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది. నెల తప్పిన స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి.
పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడు తుంది.
శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యతగ్గుతుంది. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆరసంలో ముంచి, ముక్కులోను, చెవి లోను డ్రాప్స్‌గా వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది
జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని, కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం పళ్ళుతోముతుంటే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు అరికడుతుంది. నోటి దుర్వాసనని పోగొడుతుంది. సిగరెట్ తయారీ కంపెనీలలో కూడా దీనిని వినియోగించి మెంథాల్ సిగరెట్లు తయారు చేస్తున్నారు. సిగరెట్ అలవాటు ఉన్నవారికి కొంత వరకూ గొంతు సమస్యలు రాకుండా కాపాడుతుంది.