Habits At Night : రోజువారిగా రాత్రి సమయంలో కొన్ని అలవాట్లలో మార్పు చేసుకుంటే బరువు సులభంగా తగ్గొచ్చు!

చాలా మంది రాత్రి పూట భోజనంతోపాటు స్నాక్స్‌ను కూడా తింటారు. ఇది ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు.

Habits At Night : రోజువారిగా రాత్రి సమయంలో కొన్ని అలవాట్లలో మార్పు చేసుకుంటే బరువు సులభంగా తగ్గొచ్చు!

If you make some changes in your daily habits at night, you can lose weight easily!

Updated On : November 3, 2022 / 6:20 PM IST

Habits At Night : అలవాట్లు అనేవి మనిషిపై విభిన్న కోణాల్లో ప్రభావం చూపుతాయి. మంచి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేసేవిగా ఉంటే చెడు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపేవిగా ఉంటాయి. వీటి కారణంగా చాలా మంది ఊబకాయం, అధిక బరువు వంటి వివిధ రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా రోజువారిగా చాలా మంది అనేక అలవాట్లను కలిగి ఉన్నా రాత్రి సమయంలో మాత్రం వాటిలో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా అధిక బరువు తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చూసుకోవచ్చు.

రాత్రి సమయంలో అనుసరించాల్సిన అలవాట్లు ;

1. రాత్రిపూట మద్యం సేవించే అలవాటును మానుకోవటం మంచిది. రాత్రి సమయంలో సేవించడం వల్ల శరీరం ఆ ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించడం కోసమే పనిచేస్తుంది. దీని వల్ల శరీర ధర్మాలు నిర్వర్తించలేని పరిస్ధితుల్లో ఉంటుంది. కనుక రాత్రి పూట మద్యం సేవించడం మానుకోవడం ద్వారా బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది.

2.రాత్రి పూట సాధారణంగా మనకు శక్తి తక్కువగా అవసరం అవుతుంది. కనుక తేలికపాటి ఆహారం తీసుకోవటం మంచిది. అధికంగా భోజనం చేస్తే శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. అదే తక్కువగా తింటే శరీరం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకుంటుంది. అంతేకాకుండా కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది.

3. రాత్రి నిద్రకు ముందు పెప్పర్‌మింట్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీర మెటబాలిజం రాత్రి పూట పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గుతారు.

4. చాలా మంది రాత్రి పూట భోజనంతోపాటు స్నాక్స్‌ను కూడా తింటారు. ఇది ఏమాత్రం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటం వల్ల శరీరంలో క్యాలరీలు చేరి బరువు పెరుగుతారు. కాబట్టి స్నాక్స్‌ను రాత్రి పూట తినటం మానుకోవటం మంచిది.

5. రాత్రి పూట భోజనాన్ని వీలైనంత త్వరగా చేయటం మంచిది. ఆలస్యమైతే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అదే త్వరగా భోజనం చేస్తే శరీరంపై పని ఒత్తిడి ఉండదు. కొవ్వును కరిగి బరువు తగ్గుతారు.