Tomato : వేసవిలో టమోటాను ఆహారంలో భాగం చేసుకుంటే!
టమాటలతో చారు, రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇతర ఆహార పదార్థాలతో తయారు చేసే చారు లాగే టమాటాలతో చేసే చారు ఎంతో రుచిగా ఉంటుంది. టమోటా ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది.

Tomato
Tomato : టమాటాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. టమాటాలలో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తాజా టొమాటోల్లో అధిక భాగం నీరే ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువగా ఉండడం వల్ల కెలోరీలు కూడా తక్కువే. పీచు పదార్థం, విటమిన్ – సి, పొటాషియం, విటమిన్- కె, ఫోలేట్, బీటా కెరోటీన్ వంటివి టొమాటోలో అధికంగా ఉన్నాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు, రోగనిరోధక వ్యవస్థను పెంచేందుకు టొమాటో ఉపయోగపడుతుంది.
బీపీని, కంటి సమస్యలను తగ్గించడంలో టమాటాలు ఎంతో సహాయపడతాయి. టొమాటోలో ఉండే లైకోపీన్, క్లోరినేర్గిక్ యాసిడ్ లాంటి యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు, చర్మం తాజాగా ఉండడానికి సహాయపడతాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కూడా ఆహారంలో టొమాటో భాగం చేసుకుంటే మంచిది. టమాటాలతో రుచికరమైన టమాట పప్పు, టమాట పచ్చడితోపాటు వివిధ కూరగాయలతో కలిపి వంటలను తయారు చేసుకోవచ్చు.
టమాటలతో చారు, రసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇతర ఆహార పదార్థాలతో తయారు చేసే చారు లాగే టమాటాలతో చేసే చారు ఎంతో రుచిగా ఉంటుంది. టమోటా ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. రక్తపోటుతో బాధపడుతున్న వారు రోజుకో టమోటా తినటం వల్ల మంచి మేలు కలుగుతుంది. టమోటాలోని పొటాషియం రక్తపోటు వ్యాధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
టమాటో గుజ్జు కూడా జిడ్డు చర్మాన్ని సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడుతుంది. పావు కప్పు టమాటో గుజ్జు, ఒక టీస్పూన్ తేనె తీసుకుని ఒక గిన్నెలో టమాటో గుజ్జును, తేనెను వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై పూతగా పూసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి. తరువాత శుభ్రంగా ముఖం కడుక్కుని పొడిగా తుడుచుకోండి. టమాటో చర్మం పై పేరుకున్న మృతకణాలను తొలగించడమే కాక ట్యానింగ్ ను కూడా నివారిస్తుంది. వేసవి కాలంలో ఇలా చేయటం వల్ల చర్మం ప్రకాశ వంతంగా ఉంటుంది.