IIT-H, KMC : సంతాన లేమి…బాధ పడుతున్నారా ? చింతపడకండి

భాగస్వామి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించి పిండాన్ని అభివృద్ధి చేస్తుంటారనే సంగతి తెలిసిందే. వీర్యకణాల చలనం చురుగ్గా ఉండేందుకు వీలుగా..‘పెంటోక్జ్సైన్ ఫైలిన్’ అనే ఏజెంట్ ను వాడుతుంటారు. అయితే..తాజాగా..దీనికంటే ఎక్కువ ప్రభావితం..దుష్ర్పభావాలను చూపని మాలిక్యూల్ ను IIT Hyderabad, మణిపాల్ లోని కస్తూర్బా వైద్య కళాశాల, మంగళూరు విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు.

IIT-H, KMC : సంతాన లేమి…బాధ పడుతున్నారా ? చింతపడకండి

Life

Updated On : August 11, 2021 / 8:40 AM IST

mPTX  : సంతాన లేమితో చాలా మంది బాధ పడుతుంటారు. సంతానం కలుగాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. గుళ్లు, గోపురాల చుట్టూ కొంతమంది ప్రయత్నిస్తుంటే..మరికొంత మంది వైద్యులను సంప్రదిస్తుంటారు. అందులో ప్రధానమైంది IVF పద్ధతి. భాగస్వామి నుంచి సేకరించిన వీర్యాన్ని ఉపయోగించి పిండాన్ని అభివృద్ధి చేస్తుంటారనే సంగతి తెలిసిందే. వీర్యకణాల చలనం చురుగ్గా ఉండేందుకు వీలుగా..‘పెంటోక్జ్సైన్ ఫైలిన్’ అనే ఏజెంట్ ను వాడుతుంటారు.

Read More : Viral Video: మాస్క్‌తో భయపెట్టే ఫ్రాంక్.. చివరికి కటకటాల పాలు!

అయితే..తాజాగా..దీనికంటే ఎక్కువ ప్రభావితం..దుష్ర్పభావాలను చూపని మాలిక్యూల్ ను IIT Hyderabad, మణిపాల్ లోని కస్తూర్బా వైద్య కళాశాల, మంగళూరు విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. దీనిని ‘MPTF’ పిలుస్తున్నారు. వీర్యకణాల చలనం మరింత చురుగ్గా ఉండడం, ఫలదీకరణ సామర్థ్యం పెరగడం, పిండంపై విషపూరితాల ప్రభావం లేకపోవడం దీని ప్రత్యేకతలను వారు స్పష్టం చేస్తున్నారు. IVF పద్ధతి ద్వారా సంతాన భాగ్యం పెరగడానికి అవకాశాలు ఎక్కువవుతున్నాయని, వివిధ సంస్థలతో కలిసి IIT చేస్తున్న పరిశోధనలు మంచి ఫలితాన్నిస్తున్నాయని ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు ఆచార్య బీఎస్ మూర్తి వెల్లడించారు. ఈ ఫలితాలు ఇటీవలే నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లో జర్న్ లో ప్రచురితమయ్యాయి.

Read More :Honda : చైనా మార్కెట్‌‌లో యు-జీవో ఎలక్ట్రిక్ స్కూటర్