Look Younger : యవ్వనంగా కనిపించేందుకు సౌందర్య ఉత్పత్తులకు బదులుగా !
శరీరానికి ప్రతిరోజూ 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 19 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది.

Instead of beauty products to look younger!
Look Younger : వయసు పెరుగుతున్న కూడా చర్మం యవ్వనంగా కనబడాలని మనలో చాలా మందిలో ఉంటుంది. ఇందుకోసం మార్కెట్ లో దొరికే సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. సౌందర్య ఉత్పత్తుల ద్వారా కాకుండా మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మనం యవ్వనాన్ని పెంచుకోవచ్చు. వయసు పెరిగేకొద్దీ మనం ఆరోగ్యంగా, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే మన శరీరానికి విటమిన్ ఇ చాలా అవసరం.
శరీరానికి ప్రతిరోజూ 15 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు రోజుకు 19 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ అవసరమవుతుంది. ఈ విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో బాదం పప్పు ఒకటి. 100 గ్రాముల బాదం పప్పులో 28 మిల్లీ గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. పొద్దు తిరుగుడు గింజల్లో కూడా విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఇ క్యాప్సుల్స్ ను వాడడానికి బదులుగా ఈ గింజలను ఆహారంగా తీసుకోవడం వల్ల వయసు పెరిగినప్పటికి యవ్వనంగా కనిపించవచ్చు.
తీసుకునే ఆహారాల్లో విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్ ఇ శరీరంలోని కణాన్ని, అవయవాన్ని, చర్మాన్ని కూడా వయసు తక్కువగా కనబడేలా చేయటంతోపాటు శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉండేలా తద్వారా అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండవచ్చు. కణాల పై పొరను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కణాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా విటమిన్ ఇ మనకు సహాయపడుతుంది.