Energy Drinks : ఎనర్జీ డ్రింక్స్ తాగటం ఆరోగ్యానికి మంచిదేనా?
ఎనర్జీ డ్రింక్ లను తాగేవారిలో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఎనర్జీ డ్రింక్ లో కెఫిన్, టౌరిన్ షుగర్, స్వీటెనర్, హెర్పల్ సప్లిమెంట్స్ తోపాటు హానికరమైన పదార్ధాలు ఉంటాయి.

Energy Drinks
Energy Drinks : దాహం వేసిన సందర్భంలో, ఆకలిగా ఉన్నప్పుడు సమయానికి ఆహారం అందుబాటులో లేనప్పుడు చాలా మంది తక్షణం శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్ ను తాగేస్తుంటారు. ఇటీవలి కాలంలో మార్కెట్లు వివిధ రకాల కంపెనీల ఎనర్జీ డ్రింక్ లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మంది వీటిని తాగటం రోజు వారి అలవాటుగా మార్చుకున్నారు.
అధికంగా శారీరక వ్యాయామం చేసేవారు, ముఖ్యంగా క్రీడాకారులు తక్షణ ఎనర్జీకోసం ఎనర్జీ డ్రింక్స్ ను తాగుతుండటం మనం చూస్తుంటాం. అయితే వారే కాకుండా మామూలు వారు సైతం అవసరం ఉన్నా, లేకున్నాఅదేపనిగా ఎనర్జీ డ్రింక్ లను తాగేస్తున్నారు. చాలా మంది ఇంట్లో ఫ్రిజ్ లలో ఎనర్జీ డ్రింక్ లను నిల్వ చేసుకుని తాగటం అలవాటు చేసుకున్నారు. అయితే ఇలా అదేపనిగా ఎనర్జీ డ్రింక్ లను తాగటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎనర్జీ డ్రింక్ లను తాగేవారిలో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయని పలు పరిశోధనల్లో తేలింది. ఎనర్జీ డ్రింక్ లో కెఫిన్, టౌరిన్ షుగర్, స్వీటెనర్, హెర్పల్ సప్లిమెంట్స్ తోపాటు హానికరమైన పదార్ధాలు ఉంటాయి. కెఫిన్ కారణంగా శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది ప్రధానంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె కొట్టుకునే వేగాన్ని పెరిగేలా చేస్తుంది. దీని వల్ల రక్త ప్రవాహంలో తేడాలు రావటం వంటివి చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఈ ఎనర్జీ డ్రింక్స్ లో ఉండే హానికరమైన పదార్ధాల ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపైనా పడుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది.
బాడీకి ఎనర్జీని ఇవ్వాలన్న ఆలోచనతో అనేక మంది రోజుకు నాలుగైదు ఎనర్జీ డ్రింక్ లను తాగేస్తుంటారు. ఇలాంటి వారి శరీరంలోకి ఎక్కువ మోతాదులో కెఫిన్ చేరుతుంది. దాని ప్రభావం వల్ల మానసికంగా శరీరంపై ప్రభావం చూపుటం వల్ల అదేపనిగా ఎనర్జీ డ్రింక్ లు తాగాలన్న వ్యసనాన్ని కలిగుతుంది. రోజుకు 300ఎంజి మించి కెఫిన్ శరీరంలోకి చేరితే ఆరోగ్యానికి ప్రమాదం ముప్పుతప్పదని గుర్తుంచుకోవాలి.