Dark Chocolates : డార్క్ చాకొలెట్లు తింటే ఆరోగ్యానికి మంచిదా?
మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నందున మెదడు చురుగ్గా పనిచేస్తూ మానసిక ప్రశాంతత లభిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను నివారించటంలోనూ , బరువును నియంత్రించటంలోనూ చాకొలెట్ ఉపకరిస్తుంది.

Dark Chacolate
Dark Chocolates : ఆహారపదార్ధాల్లో మోతాదుకు మించి చక్కెర వాడితే అనర్ధదాయకమన్న విషయం అందరికీ తెలిసినా, అయినప్పటికీ తీపిని అందించే చాకొలెట్లను తినడం వల్ల ఆరోగ్యంతోపాటు మానసిక ఉత్తేజం తధ్యమని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు. పలు అధ్యయనాల్లో చాకొలెట్లకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వృద్ధప్య ఛాయలు రాకుండా ఉండాలన్నా, రక్త సరఫరా మెరుగుపడాలన్నా , అదనపు బరువు తగ్గించుకోవాలన్నా మితంగా చాకొలెట్లను తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
చాకొలెట్లలోని ఫ్లవనోల్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. వీటిని తినడం వల్ల మెదడులో శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. తాజా పండ్లు, కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు చాకొలెట్లలోనూ ఉన్నందున చర్మం ముడతలు పండటం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. చాకొలెట్లను తినడం వల్ల మానసిక స్ధాయి మెరుగవుతుందని , ఒత్తిళ్ల నుండి ఉపశమనం కలుగుతుందని వారు చెబుతున్నారు.
మెగ్నీషియం వంటి ఖనిజాలు అధికంగా ఉన్నందున మెదడు చురుగ్గా పనిచేస్తూ మానసిక ప్రశాంతత లభిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను నివారించటంలోనూ , బరువును నియంత్రించటంలోనూ చాకొలెట్ ఉపకరిస్తుంది. రోజుకు రెండు, మూడు చాకొలెట్లను తినటం వల్ల ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. మంచి నాణ్యమైన డార్క్ చాకొలెట్ తినటం వల్ల కొవ్వు పెద్ద మొత్తంలో కరిగిపోయి ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఆరోగ్యం మెరుగుపరచడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులను ప్రమాదం నుండి తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా కూడా సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ధమనులు గట్టిపడటాన్నినిరోధించవచ్చు. మెదడులో ఎండర్పియన్ ను ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మెదడు యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్ కణాలు సమర్ధవంతంగా సహజ సిద్ధంగా పనిచేయటానికి ఇన్సులిన్ సామర్ధ్యాన్ని తగ్గించటానికి తోడ్పడుతుంది. చాక్లెట్ లోని ఐరన్, రక్తంలో ఐరన్ లోపించకుండా, అనీమియాకు గురికాకుండా రక్షణనిస్తుంది.