Carrots : చలికాలంలో క్యారెట్ తింటే మంచిదేనా?…

క్యారెట్ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్ సి మీ శరీరంలో యాంటీబాడీలను తయారు చేయడంలో సహాయపడుతుంది.

Carrots : చలికాలంలో క్యారెట్ తింటే మంచిదేనా?…

Carrot

Updated On : December 8, 2021 / 4:00 PM IST

Carrots : శీతాకాలంలో లభించే క్యారెట్‌లను తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇవి రుచితోపాటు ఎన్నో పోషక గుణాలతో నిండిఉంటాయి. వీటిని పలు వంటలలో ఉపయోగించవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పోషకాలున్న క్యారెట్ ను తీసుకువటం ఎంతో మంచిది. ముఖ్యంగా చలికాలంలో దుంపలు అనేవి మన ఆరోగ్యానికి ఎంత మంచిది. భూమి లోపల పండే దుంపలు తింటే ఆరోగ్యానికి చాలా శ్రేష్ఠమని వైద్య నిపుణులు చెబుతుంటారు. అందులో భూమిలో పండే క్యారెట్ అయితే మనిషి ఆరోగ్యానికి బంగారు కవచం లాంటిది. ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.

క్యారెట్ లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాన్ని మరింత పటిష్టం చేస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో దొరికే క్యారెట్ లో పోషకాలతో పాటుగా రుచి కూడా అధికంగా ఉంటాయి. అవును చలికాలంలో దొరికే క్యారెట్ లు బలే రుచిగా ఉంటాయి. ఇక క్యారెట్ అనేది ఏ సీజన్ లో అయినా మనకు అందుబాటులో ఉండే ఒక కూరగాయ. ఇది మన శరీరానికి ఎన్ని విధాలుగా మంచి చేస్తుంది.

క్యారెట్ లో ఉండే పీచు పదార్థం వలన జీర్ణ క్రియ మెరుగ్గా పనిచేస్తుంది. క్యారెట్‌లో అధిక మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని విటమిన్ ఎ ఎక్కువగా పెంపొందెలా చేసి కళ్ళను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందుకే మనం నిత్యం క్యారెట్ ను తినాలని నిపుణులు సూచిస్తారు.

గుండె కు కూడా క్యారెట్ లోని పోషకాలు కవచంలా పనిచేస్తాయట. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు తరచూ వారి ఆహారంలో క్యారెట్ తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అంతేకాకుండా మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో కూడా క్యారెట్ లోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయట. రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా క్యారెట్ లు చాలా చక్కగా ఉపయోగపడతాయి.

క్యారెట్ తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. క్యారెట్‌లో ఉండే విటమిన్ సి మీ శరీరంలో యాంటీబాడీలను తయారు చేయడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో శరీరాన్ని సిద్దం చేస్తుంది. క్యారెట్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో మధుమేహం ఉన్నవారు తప్పనిసరిగా క్యారెట్ తినాలి. క్యారెట్‌లో ఉండే ఫైబర్ రక్తంలో ఆరోగ్యకరమైన చక్కెరను నిర్వహించడానికి సహాయపడుతుంది.

క్యారెట్ ప్రతిరోజూ తీసుకుంటే మీ ఎముకలను స్ట్రాంగ్ గా మారుతాయి. క్యారెట్‌లో కాల్షియం, విటమిన్ కె సమృద్ధిగా ఉంటాయి. ఇవి రెండు ఎముకలకు చాలా ముఖ్యం. మలబద్ధకం సమస్య ఉంటే పచ్చి క్యారెట్ తింటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్న రోగులు ఎల్లప్పుడూ పచ్చి క్యారెట్లను తినాలని సూచిస్తున్నారు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని పూర్తిగా నివారిస్తుంది.

క్యారెట్ జ్యూస్ తాగడం ద్వారా చర్మం నిగనిగలాడుతుంది. అలాగే క్యారట్ జ్యూస్ రెగ్యులర్‌గా తాగడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. తద్వారా కంటి దృష్టి లోపాలు తలెత్తవు. మ‌హిళ‌లు నిత్యం ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ దూరమవుతుంది. క్యారెట్లలో వుండే విటమిన్ ఎ, బీటా కెరోటీన్‌లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై ముడతలను తగ్గిస్తాయి. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.