Swimming : గర్భధారణ సమయంలో ఈత సురక్షితమేనా?
గర్భదారణ సమయంలో స్విమ్మింగ్ చేయాలనుకుంటే ముందుగానే ప్రమాదాల గురించి ఒక అంచనాకు రావాలి. అనువైన, సురక్షితమైన ప్రాంతాల్లోనే ఈత కొట్టాలి. గర్భవతిగా ఉన్నప్పుడు స్విమ్మంగ్ వల్ల త్వరగా అలసి పోయే అవకాశాలు ఉంటాయి. నదలు, సముద్రాల వద్ద స్విమ్మింగ్ చేస్తుంటే తగిన జాగ్రత్తలు పాటించటం ఉత్తమం.

Swimming During Pregnancy
Swimming : గర్భవతిగా ఉన్నప్పుడు కొన్నిపనులు చేయకూడని వారిస్తుంటారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకు సురుక్షితం కాదన్న ఉద్దేశంతోనే అలా చెప్తుంటారు. కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం, నిద్ర, తేలికపాటి వ్యాయామాలు చేయమని నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా గర్భదారణ సమయంలో స్విమ్మింగ్ చేయటం గర్భిణులకు అంత సురక్షితమేనా అన్న సందేహాం చాలా మందిలో ఉంది.
అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ ప్రకారం, గర్భధారణ సమయంలో సురక్షితమైన వ్యాయామాలలో ఈత ఒకటి. అదే సమయంలో వాటర్ స్కీయింగ్, డైవింగ్, స్కూబా డైవింగ్‌లు గర్భిణీ స్త్రీలకు ప్రమాదాలు కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని
ప్రయత్నించకపోవటమే మంచిది. ఈత అనేది శరీరంపై అధిక స్థాయి ఒత్తిడిని కలిగించకుండా, గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సమయంలో వ్యాయామం అనేది అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సమయంలో ఓర్పు, కండరాల బలాన్ని కోల్పోవడం వంటివి చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో స్విమ్మింగ్ ఫిట్‌నెస్ స్థాయిని పెంచటానికి సురక్షితమైన మార్గంగా దోహదపడుతుంది. స్విమ్మింగ్ అనేది శరీర వ్యాయామం, ఇది శరీర కండరాలను
బలపరుస్తుంది. దీని వల్ల ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. శరీర బలం పెరుగుతుంది. హృదయనాళ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఈత తోడ్పడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
అదే క్రమంలో గర్భధారణ సమయంలో ఈత కొట్టడం సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతున్నప్పటికీ, గర్భధారణ సమస్యల కారణంగా వైద్య పరిస్థితులు, పరిమితులు ఉన్న మహిళలు స్విమ్మింగ్ చేయకపోవటం మంచిదని గుర్తుంచుకోవాలి. గర్భధారణ సమయంలో స్విమ్మింగ్ విషయంపై వైద్యుని సంప్రదించటం మంచిది. అలాగే సాధారణ వ్యాయామ ప్రణాళికలో ఎలాంటి మార్చుఉన్నా వైద్యునికి తెలియజేసి వారి సూచనలు , సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
గర్భదారణ సమయంలో స్విమ్మింగ్ చేయాలనుకుంటే ముందుగానే ప్రమాదాల గురించి ఒక అంచనాకు రావాలి. అనువైన, సురక్షితమైన ప్రాంతాల్లోనే ఈత కొట్టాలి. గర్భవతిగా ఉన్నప్పుడు స్విమ్మంగ్ వల్ల త్వరగా అలసి పోయే అవకాశాలు ఉంటాయి. నదలు, సముద్రాల వద్ద స్విమ్మింగ్ చేస్తుంటే తగిన జాగ్రత్తలు పాటించటం ఉత్తమం. స్మిమ్మింగ్ చేసే ప్రాంతంలో నీరు నాణ్యత అందులోని బ్యాక్టీరియా ఉన్నట్లు ఏవైనా అనుమానం ఉన్నా అలాంటి ప్రదేశాల్లో స్విమ్మింగ్ చేయకపోవటమే మంచిది.
గర్భదారణ సమయంలో స్విమ్మింగ్ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. గర్భదారణ సమయంలో నిద్రలేమి సహజంగానే ఉంటుంది. స్విమ్మింగ్ చేయటం వల్ల రాత్రి నిద్ర పట్టేందుకు అవకాశం ఉంటుంది. గర్భదారణ సమయంలో వాపులు, నొప్పులు ఉండే అవకాశం ఉంటుంది. స్విమ్మింగ్ వల్ల వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈత మీ పుట్టబోయే బిడ్డ యొక్క నాడీ వ్యవస్థకు సహాయపడుతుంది. మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. నరాల సంబంధిత సమస్య అయిన హైపోక్సియా-ఇస్కీమియా నుండి ఈత శిశువులను రక్షిస్తున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. స్విమ్మింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.