Gaya Pind daan : గయలో పిండ ప్రదానం ఎందుకు చేస్తారంటే?

చనిపోయిన వారికి, పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి భారతదేశంలో 55 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖమైనది గయ. గయలో పిండ ప్రదానం చేస్తే పూర్వీకులకు మోక్షం లభిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.

Gaya Pind daan : గయలో పిండ ప్రదానం ఎందుకు చేస్తారంటే?

Gaya Pind daan

Gaya Pind daan : చనిపోయిన వారి ఆత్మ మోక్షం పొందడానికి పిండ ప్రదానం చేస్తారు. పలు పుణ్యక్షేత్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. చాలామటుకు ‘గయ’లో పిండ ప్రదానం చేస్తారు. దీని వెనుక అంతరార్థం ఏమిటంటే?

Famous Temple : అప్పుల బాధల్ని తీర్చే దేవాలయం .. దీపం వెలిగిస్తే చాలు రుణబాధల్ని తొలగించే ఆపద్బాంధవుడు..

దేశ వ్యాప్తంగా చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడానికి 55 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో బీహార్ రాష్ట్రంలో ఉన్న గయ ప్రముఖమైనది. ఇండియాలోని పురాతన పుణ్యక్షేత్రం గయ. అనేక హిందూ దేవాలయాలకు గయ నిలయంగా కూడా ఉంది. ఇక్కడ చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడం వెనుక కారణం ఏంటంటే? ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం పొందుతారు అని విశ్వసిస్తారు. అంతేకాకుండా తల్లిదండ్రులతో సహా కుటుంబంలోని ఏడు తరాల వారు రక్షించబడతారని నమ్మతారు. హిందూ ఇతిహాసాల ప్రకారం శ్రీరాముడు గయలోనే తన తండ్రికి పిండ ప్రదానం చేశాడని చెబుతారు.

పురాణాల ప్రకారం ఈ ప్రాంతానికి సంబంధించి ఓ కథ ఉంది. భస్మాసురుడి వంశానికి చెందిన గయాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడిని తన శరీరం కూడా దేవతల శరీరంలా పవిత్రంగా మారాలని వరం కోరుతూ కఠినమైన తపస్సు చేశాడట. తనను ప్రజలు దర్శించుకుంటే వారి పాపాలు పోవాలని కూడా కోరాడట. ఈ వరం తరువాత స్వర్గంలో ప్రజల సంఖ్య పెరిగిపోవడం మొదలుపెట్టిందట. గయాసురుడిని నిలువరించడానికి యాగం కోసం పవిత్ర స్థలాన్ని అడిగారట. గయాసురుడు తన శరీరాన్ని దానం చేశాడట. గయాసురుడు పడుకున్నప్పుడు అతని శరీరం ఐదు కోసుల దూరం వ్యాపించిందట. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని ‘గయ’ అని పిలుస్తున్నారు.

3D Printed Temple : ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ దేవాలయం.. తెలంగాణలోని సిద్ధిపేటలో

ఎవరైనా గయలో తమ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తే వారి పూర్వీకులకు మోక్షం కలుగుతుందని దేవతలు ఆశీర్వదించారు. యాగం ముగిసిన తరువాత విష్ణువు గయాసురుడి వీపుపై రాయిని ఉంచి లేచి నిలబడ్డాడట. ఈ కారణం వల్ల ప్రజలు పిండ ప్రదానం చేయడానికి గయకు వెళ్తారు. గయ జిల్లాను ‘విష్ణునగరం’ అని, ‘మోక్ష భూమి’ అని పిలుస్తారు. గరుడ పురాణాల ప్రకారం ఎవరికైతే ఇక్కడ  శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారో ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడని నమ్ముతారు.