Jogging : రోజుకు 30 నిమిషాలు జాగింగ్ చేస్తే రక్తపోటుతోపాటు, మధుమేహం నియంత్రణలో!
డయాబెటిస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడానికి జాగింగ్ బాగా ఉపకరిస్తుంది. యుక్తవయస్సులో ఉన్నవారు రోజు వారిగా జాగింగ్ చేస్తే డయాబెటిస్ వచ్చే అవకాశాలు నూటికి 90 శాతం తగ్గిపోతాయి.

Jogging
Jogging : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక వ్యాయామం అవసరం. ప్రతిరోజు కనీసం30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు రన్నింగ్ చేయటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని, జీవితకాలం కూడా పెరుగుతుందని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. హృద్రోగులు, కేన్సర్ బాధితులు వారానికి కనీసం 25 నిమిషాలు రన్నింగ్,జాగింగ్ చేస్తే ఆయుష్షు పెంచుకోవచ్చని తెలిపారు. రన్నింగ్ లేదా జాగింగ్ చేయటం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. కొవ్వు కరిగి. శరీరానికి మంచి షేప్ వస్తుంది. కొవ్వు కరిగించడంలో జిమ్‌లు, డాక్టర్లు చేయలేని పని జాగింగ్ చేయగలదు. జాగింగ్ వల్ల శరీరంలో కేలోరీలు ఖర్చవుతాయి. ఫలితంగా రోజంతా మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
ప్రతి రోజు ఉదయం మూడు కిలో మీటర్లు జాగింగ్ చేయడం వల్ల ఎముకలు, కండరాలు ఫిట్ గా ఉంటాయి. మూడు నెలలు క్రమం తప్పకుండా జాగింగ్ చేస్తూ, హెల్దీ డైట్ అనుసరిస్తే ఏడు నుంచి పది కిలోల బరువు తగ్గవచ్చు. జాగింగ్ తో మానసిక ఒత్తిళ్లు సైతం పరారవుతాయి. ఉదయపు నడకతో రక్త కణాలు చురుకుగా కదులతాయి. దీంతో మెదడుకు రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. రక్త సరఫరా మెరుగవ్వడం వల్ల హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన అనారోగ్యాలు దరి చేరవు.
డయాబెటిస్ ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడానికి జాగింగ్ బాగా ఉపకరిస్తుంది. యుక్తవయస్సులో ఉన్నవారు రోజు వారిగా జాగింగ్ చేస్తే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. జన్యుపరంగా డయాబెటిస్ వచ్చే ప్రమాదమూ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం చేసే జాగింగ్ వల్ల రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్ర పోవచ్చు. రోజంతా మెదడు ఆరోగ్యకరంగా పని చేయడం మూలాన రాత్రి వేళలో నిద్రబాగా పడుతుంది.
జాగింగ్ వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా మెరుగుపడుతాయి. శాస్వప్రక్రియతో పాటు గుండెవేగం, రక్తనాళాల్లో రక్తప్రసరణ పెరగడం వంటివి మెరుగ్గా ఉంటాయి. జాగింగ్ చేయడానికి జిమ్‌లో లాగా కష్టపడాల్సిన అవసరం లేదు. జాగింగ్ చేసే సమయంలో శరీరం నుంచి ఎండోర్ఫిన్స్ అనే హార్మోన్స్ విడుదల అవుతుంది. ఈ గ్రూప్ హార్మోన్లు మానసిక ప్రశాంతకు సహాయపడుతాయి. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే కనుక జాగింగ్ మంచి మార్గంగా చెప్పవచ్చు.