Lose Weight Easily : బరువు సులభంగా తగ్గాలంటే ఈ సహజమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది!
ఒక తమలపాకులో 5 నుండి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలన్న లక్ష్యంతో ఉన్నవారికి సమతుల ఆహారం, శారీరక శ్రమ, సరైన నిద్ర, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి తప్పనిసరని గుర్తుంచుకోవాలి.

How to lose weight safely and naturally:
Lose Weight Easily : బరువు తగ్గించుకోవడానికి రకరకాల మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా మనం బరువును తగ్గించుకోవచ్చు.
జీలకర్ర నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యల బారిన కూడా పడకుండా ఉంటాము. ఒక టీ స్పూన్ జీలకర్రను దంచి రాత్రి నీటిలో వేసి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం ఈ నీటిని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.
అలాగే తేనె, నిమ్మరసంలో బరువును తగ్గించే అనేక పోషకాలు ఉంటాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ తేనె, అర చెక్క నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా తీసుకున్న తరువాత రోజూ వారి వ్యాయామాలను చేయాలి.
తినే ఆహారంలో ఎక్కువ శాతం పచ్చి కాయగూరలు మరియు పండ్లు ఉండేలా చూసుకోండి. కనీసం 30% శాతం ఉండేలా చూసుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు. కొద్దిగా కొత్తిమీర, 3 నుండి 4 చిన్న అల్లం ముక్కలు కలిపి నీళ్ళు వేసి మిక్సీకి వేసుకొని జ్యూస్ గా చేసుకుని అందులో 1 స్పూన్ తేనె మరియు సగం నిమ్మకాయ బద్దను పిండుకోవాలి. ఈ నీటిని రోజూ పరగడపున సేవిస్తే సులువుగా బరువు తగ్గవచ్చు.
ఒక తమలపాకులో 5 నుండి ఆరు మిరియాలు కలిపి చుట్టి రోజూ ఉదయం టిఫిన్‌కి ముందు తిని, ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి. ఇది శరీరంలోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది. అలాగే బరువు తగ్గాలన్న లక్ష్యంతో ఉన్నవారికి సమతుల ఆహారం, శారీరక శ్రమ, సరైన నిద్ర, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం వంటివి తప్పనిసరని గుర్తుంచుకోవాలి.
సలాడ్ లు, తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు , పప్పులు, గింజలను ఆహారంతో తీసుకోండి. కార్బొహై డ్రాట్స్ మీ ఆహారం లో తక్కువగా, ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వు, కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువగా ఆహారం లో ఉండేలా చూసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే పరగడుపున ముందుగా ఓ చెంబు గోరు వెచ్చని నీరు తాగాలి.
ఇలాంటి సహజమైన చిట్కాలు బరువును తగ్గించటంలో బాగా ఉపకరిస్తాయి. ఎలాంటి మందులు, సర్జరీలు లేకుండానే ఇంటి వద్దే సులభంగా ఈ చిట్కాలను పాటిస్తూ బరువును తగ్గేందుకు అవకాశం ఉంటుంది.