ట్రెండింగ్ ఐటమ్స్ : నటుల పేరుతో పిలిచే వంటకాలు ఇవిగో!
మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ ఇలా ఎన్నో దోశల గురించి విన్నాం కాని ఈ దీపికా పదుకొనే, చిరు దోశల గోలేంటండి....అనుకుంటున్నారా చెప్పడం ఎందుకు ఈ వార్త చదివితే అసలు విషయం మీకే అర్ధం అవుతుంది....

మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ ఇలా ఎన్నో దోశల గురించి విన్నాం కాని ఈ దీపికా పదుకొనే, చిరు దోశల గోలేంటండి….అనుకుంటున్నారా చెప్పడం ఎందుకు ఈ వార్త చదివితే అసలు విషయం మీకే అర్ధం అవుతుంది….
మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ ఇలా ఎన్నో దోశల గురించి విన్నాం కానీ, ఈ దీపికా పదుకొనే, చిరు దోశల గోలేంటిరా బాబూ అనుకుంటున్నారా. చెప్పడం ఎందుకు.. ఈ వార్త చదివితే అసలు విషయం మీకే అర్ధం అవుతుంది. వేడి వేడి దీపికా పదుకొనే దోశ, పసందైన దోశ!’ అని వినబడగానే ఒక్క అభిమానులకే కాదు ఎవరికైనా నోట్లో నీళ్లురాలిసిందే. అమెరికాలోని ఆస్టిన్‌లో ‘దోశ లాబ్స్’ హోటల్‌లో, ఆలు కుర్మాతో చేసిన ‘దీపికా పదుకొనే దోశ’ను విక్రయిస్తున్నారంటూ వార్త ఒకటి జనవరి 1వ తేదీన వైరల్ అయింది. దాంతో పుణెలో ఆమె పేరుతో ‘పరంతా తాళి’ అంటూ భోజనాన్ని విక్రమిస్తున్నారంటూ ట్వీట్లు వెలువడ్డాయి. ఆ మాటకొస్తే ఆమె ఒక్కదాని పేరు మీదనే కాకుండా పలువురు సినీ తారల పేర్ల మీద భారత్‌లోని పలు ప్రాంతాల్లో పలు హోటల్లో తిను బండారాలు తయారు చేస్తున్నారు. కొందరైతే సినీ తారలు సినిమాల్లో నటించిన పాత్రల పేరిట కూడా స్నాక్స్ చేస్తున్నారు.
ముంబైలోని నూర్ మొహమ్మది హోటల్‌లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పేరు మీద ‘చికెన్ సంజూ బాబా’ను అమ్ముతున్నారు. 95 ఏళ్ల ఆ హోటల్ యజమాని ఖలీద్, సంజయ్‌తో తనకున్న అనుబంధానికి గుర్తుగా ఆ పేరు పెట్టుకున్నారు. ఆ హోటల్‌లో 1986లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ సెక్షన్‌ను సంజయ్ దత్ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అప్పడు సంజయ్‌కి హోటల్ యజమాని ఓ చికెన్ డిషన్‌ను సర్వ్ చేశారు. అప్పటి నుంచి ఆ డిష్‌కు ఆయన పేరే పెట్టారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో మూడేళ్ల జైలు శిక్ష విదించారు. 2016, పిబ్రవరిలో సంజయ్ విడుదలైనప్పుడు ఈ హోటల్ యజమాని 12 గంటలపాటు చికెన్ సంజు బాబా డిష్‌ను ఉచితంగా ప్రజలకు పంచి పెట్టారు.
వామ్మో.. చిరు దోశ కూడా:
తెలుగు సినీ నటుడు మన మెగాస్టార్ చిరు పేరున కూడా నూనే లేకుండా ఆవిరి మీద ఉడికించే ‘చిరు దోశ అమ్ముతున్నారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా కనిపించే ఈ దోశ హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి నుంచే పాకిందట. మైసూర్‌లోని ఓ చిన్న ఫుడ్ కార్నర్‌లో ఈ దోశను చిరంజీవి కనిపెట్టారట. హైదరాబాద్‌లోని ‘చట్నీస్’ కూడా కొంతకాలం ‘చిరంజీవి దోశ’ అంటూ స్టీమ్డ్ దోశను చెలామణి చేసిందట.
– యాక్టర్స్ డిషెస్
– దీపికా పదుకొనే దోశ
– సంజయ్ దత్ చికెన్ సంజూ
– మెగాస్టార్ చిరు దోశ