Cell Phone : నిద్రలేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారా!…కంటిసమస్యలతోపాటు… రక్తపోటు ఖాయం

రాత్రిళ్లు పొద్దు పోయే వరకు మొబైల్ ఫోన్ లో గడపటం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రి సరిగా నిద్రపోకపోవటం ఉదయాన్ని తిరిగి నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ తో దినచర్యను ప్రారంభించటం వల్ల మెదడుపై తీవ్రప్రభావం పడుతుంది.

Cell Phone : నిద్రలేవగానే సెల్ ఫోన్ చూస్తున్నారా!…కంటిసమస్యలతోపాటు… రక్తపోటు ఖాయం

Bed Mobile

Updated On : February 15, 2022 / 3:08 PM IST

Cell Phone : ఉదయం లేవగానే రెండు అరచేతులో , దేవుడి చిత్ర పటాన్నో చూసేవారు పాతతరం వారు. అయితే ప్రస్తుతం జనరేషన్ మారింది. కొత్త టెక్నాలజీ వచ్చేసింది. దీంతో రాత్రి నిద్రకు ముందు సెల్ ఫోన్, ఉదయం నిద్రలేచిన వెంటనే సెల్ ఫోన్ చూసే కాలం ప్రస్తుతం నడుస్తుంది. మొబైల్ ఫోన్ చేతిలో లేకుండా రోజు గడవని పరిస్ధితి నెలకొంది.

ఉదయం నిద్రమేల్కొని కళ్లు తెరిచిన వెంటనే మొబైల్ చూడటం అలవాటైపోయింది. అప్పుడు మొదలు రాత్రి పడుకోబోయే వరకు అదే సర్వసంగా మారిపోయింది.. అయితే నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటు చాలా డేంజరంటున్నారు నిపుణులు. ఇలాంటి వారు ఆపద్దతి మార్చుకోకుంటే భవిష్యత్తులో అనేక శారీరక రుగ్మతలకు లోను కావాల్సి వస్తుందని హెచ్చిరిస్తున్నారు.

ఉదయం కళ్లు తెరవగానే మొబైల్ ని చూడడం వల్ల లైటింగ్ కిరణాలు కళ్లకు తీవ్రహానికలిగిస్తాయట. ఈ లైటింగ్ కళ్లకు ఏమాత్రం మంచిదికాదు. దీని వల్ల శరీరక ఒత్తిడి పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తల బరువుగా ఉండటం…సరిగా ఆలోచించలేకపోవటం వంటి పరిస్ధితులు ఏర్పడతాయి. తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటును మానుకోవటం మంచిదని గుర్తుంచుకోండి.

ఉదయాన్నే నిద్రలేవగానే ఫోన్ చూసే వారిలో చాలా మందిలో రక్తపోటు సమస్య తలెత్తుతున్నట్లు ఇటీవల పలు అధ్యయానాల్లో తేలింది. మొబైల్ వల్ల తెలిసే ఇబ్బందికరమైన అంశాలతోపాటు, లైటింగ్ కారణంగా ఒత్తిడి పెరగటం చివరకు అదికాస్త రక్తపోటుకు దారితీసే అవకాశాలు ఉంటాయి. ఈ సమస్య చివరకు తీవ్రస్ధాయికి చేరి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి.

రాత్రిళ్లు పొద్దు పోయే వరకు మొబైల్ ఫోన్ లో గడపటం వల్ల నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రి సరిగా నిద్రపోకపోవటం ఉదయాన్ని తిరిగి నిద్రలేచిన వెంటనే మొబైల్ ఫోన్ తో దినచర్యను ప్రారంభించటం వల్ల మెదడుపై తీవ్రప్రభావం పడుతుంది. దీని వల్ల రోజు వారి దినచర్యపై పూర్తిస్ధాయిలో నిమగ్నం కాలేకపోవటం, చిన్న విషయాలకే చిరాకు పడటం, అనుకున్న పనులను సక్రమంగా చేయలేకపోవటం, నిస్సత్తువ వంటి పరిస్ధితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఫోన్ లో వచ్చిన మెసేజెస్ లు నోటిఫికేషన్స్ అన్నీ చెక్ చేసే సమయంలో ఇబ్బంది కలిగించేవి వాటిలో ఉంటే వాటి గురించి రోజంతా ఆలోచిస్తూ గడపటం వంటివి చోటు చేసుకుంటాయి. కాబట్టి ఉదయాన్నే నిద్రలేవగానే వీలైనంత వరకు మొబైల్ ఫోన్ చూసే అలవాటును మానుకోవటం మంచిది.