Leg Ulcers : మధుమేహ సమస్య ఉన్నవారిలో కాళ్లకు పుళ్లు పడితే వాటిని నివారించే సహజ చిట్కాలు!

మధుమేహంతో బాధపడుతున్న వారు ఇన్సులిన్‌ పెరుగుతుందనే భయంతో అయోడిన్‌ తక్కువ మోతాదు తీసుకుంటారు. వాస్తవానికి మన శరీరానికి అయోడిన్‌ కచ్చితంగా అవసరం ఉంటుంది. ఫుట్‌ అల్సర్‌ను తగ్గించడంలో అయోడిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

Leg Ulcers : మధుమేహ సమస్య ఉన్నవారిలో కాళ్లకు పుళ్లు పడితే వాటిని నివారించే సహజ చిట్కాలు!

Natural tips to prevent leg ulcers in people with diabetes!

Updated On : November 16, 2022 / 1:07 PM IST

Leg Ulcers : షుగర్ ఉన్న వారిని ఎక్కువగా వేధించే సమస్య ఫుట్‌ అల్సర్‌. కాళ్లకు పుళ్లు, మంటలు వంటివి వేధిస్తుంటాయి. షుగర్‌ ఉండనప్పుడు ఈ పరిస్ధితి ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో మధుమేహ బాధితులు రోజూ వారీ పనుల్ని కూడా సక్రమంగా, సమర్థంగా చేసుకోలేక ఇబ్బంది పడతారు. కాళ్ల భాగాలు దెబ్బ తిని పరిస్ధితి విషమంగా మారే ప్రమాదం ఉంటుంది. ఫుట్‌ అల్సర్‌ను ప్రారంభంలోనే గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. మధుమేహ ఫుట్‌ అల్సర్‌తో ఇబ్బంది పడేవారు కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు.

మధుమేహుల్లో కాళ్ల గాయాలను తగ్గించే చిట్కాలు ;

కలబంద ; చర్మ గాయాల్ని నయం చేయడంలో కలబంద చక్కగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు డయాబెటిక్‌ ఫుట్‌ అల్సర్‌కి చికిత్సగా పని చేస్తుంది. ఇందులోని సహజ గుణాలు.. పాదాలకు చల్లదనాన్ని కూడా అందిస్తాయి. మృదువుగానూ చేస్తాయి. మీరు మీ రోగ నిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవడానికి ఒక కప్పు కలబంద గుజ్జును సైతం తీసుకోవచ్చు. దీని వల్ల త్వరగా గాయాలు తగ్గిపోతాయి.

అవిసెగింజల నూనె ; అవిసె గింజల నూనె మదుమేహుల్లో ఏర్పడే ఫుట్‌ అల్సర్‌ను తగ్గించుకోవడానికి సహాయ పడతాయి. ఈ నూనెలో ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్లు ఉండటం వల్ల డ్యామేజీ అయిన బ్లడ్‌ వెజెల్స్‌ను బాగు చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. వాస్కులర్ హెల్త్‌ను అవిసె గింజల నూనె మెరుగుపరుస్తుంది. పాదాలకు ఈ నూనెను రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

అయోడిన్ ; మధుమేహంతో బాధపడుతున్న వారు ఇన్సులిన్‌ పెరుగుతుందనే భయంతో అయోడిన్‌ తక్కువ మోతాదు తీసుకుంటారు. వాస్తవానికి మన శరీరానికి అయోడిన్‌ కచ్చితంగా అవసరం ఉంటుంది. ఫుట్‌ అల్సర్‌ను తగ్గించడంలో అయోడిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కాళ్ల పుళ్లు, మంటలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు కాస్త అయోడిన్‌ను డైట్‌లో చేర్చుకోవడం ముఖ్యం. దీని వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

జింక్ ; ఫుట్‌ అల్సర్‌ను నయం చేయడంలో జింక్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. గుడ్లు, నట్స్‌, లిగమెంట్స్‌లో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. వీటిని మధుమేహం ఉన్న వారు తీసుకోవడం వల్ల ఫుట్‌ అల్సర్‌ను దూరం చేసుకోవచ్చు. జింక్‌ వల్ల శరీరంలో షుగర్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు జింక్‌ వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. కాబట్టి వీటిని మీ డైట్‌లో చేర్చుకోండి.

టీ ట్రీ ఆయిల్ ; టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెతో కలిసి సమాన పరిమాణంలో తీసుకుని ఫుట్ అల్సర్‌పై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని రాయటం వల్ల గాయం వేగంగా మానేందుకు అవకాశం ఉంటుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు కూడా గాయాల్ని మానేలా చేస్తుంది. అయితే రాసేటప్పుడు కాస్తా తక్కువ పరిమాణంలో వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తేనె ; గాయాల్ని తగ్గించడంలో తేనె చక్కగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గాయాలపై అద్భుత పని తీరును కనబరుస్తాయి. గాయాలకు మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ కాకుండా చూడటమే కాకుండా నొప్పిని తగ్గిస్తుంది. గాయాలు వేగంగా తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

కాఫీ ; మధుమేహ ఫుట్‌ అల్సర్‌కు కాఫీ తోడ్పడుతుంది. కాఫీ అనేది సెంట్రల్‌ నర్వస్ సిస్టమ్‌ను నియంత్రిస్తుంది. ఫుట్‌ అల్సర్‌కు ప్రారంభంలోనే చికిత్స ఎంతో ముఖ్యం. మధుమేహం ఉన్న వారు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. గాయాలు మానేందుకు ఎక్కువ కాలం పడుతుంది. కాబట్టి వైద్యుల్ని కలిసి, వారి పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు.

తొలి దశలో డయాబెటిక్‌ ఫుట్‌ అల్సర్‌ను గుర్తిస్తే తగ్గించుకోవటం ఈజీగా ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తేమాత్రం ఇన్ఫెక్షన్ కారణంగా కాలు మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పరిస్ధితి చేయిదాటితే సర్జరీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫుట్‌ అల్సర్‌ గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స పొందటం మంచిది.