Neck Skin Tips : ఇలా చేస్తే.. మీ మెడ చుట్టూ నలుపు ఇట్టే మాయం..!

అందంగా ఉండాలని అందరికి ఉంటుంది. అయితే చాలామందిలో చర్మంపై నల్లటి చారలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముఖంపై ఏదో ఒక క్రీమ్ రాస్తూ అందంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

Neck Skin Tips : ఇలా చేస్తే.. మీ మెడ చుట్టూ నలుపు ఇట్టే మాయం..!

Neck Skin Tips You Can Reduce Black Heads On Neck Skin Instantly

Updated On : July 23, 2022 / 12:07 AM IST

Neck Skin Tips : అందంగా ఉండాలని అందరికి ఉంటుంది. అయితే చాలామందిలో చర్మంపై నల్లటి చారలు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముఖంపై ఏదో ఒక క్రీమ్ రాస్తూ అందంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, చాలామంది తమ మెడ చుట్టూ ఉన్న నలుపును పట్టించుకోరు. అలానే వదిలేస్తారు. మెడ చుట్టూ నలుపు సమస్యను తగ్గించుకోవాలంటే ఇంట్లోనే చేసుకునే అనేక హోం రెమడీలు అందుబాటులో ఉన్నాయి. మెడను పట్టించుకోకపోవడం కారణంగా మెడపై మురికి చేరుతుంది. రంగు ముదురు రంగులోకి మారుతుంది.

మెడ నల్లబడటానికి జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. అలాగే పెరుగుతున్న ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. PCOD సమస్య, మధుమేహ వ్యాధి, హైపోథైరాయిడిజం వంటి అనేక కారణాలు ఉన్నాయి. పెర్ఫ్యూమ్‌కు అలెర్జీ కారణంగా మెడ రంగు నల్లగా మారుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా మరింత తీవ్రమవుతుంది. డార్క్ నెక్‌తో ఇబ్బంది పడేవారికి హోం రెమడీలు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్నింటిని పాటించడం ద్వారా ఈ సమస్యను నుంచి తొందరగా బయటపడొచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం.

Neck Skin Tips You Can Reduce Black Heads On Neck Skin Instantly (1)

Neck Skin Tips You Can Reduce Black Heads On Neck Skin Instantly

ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని పరిమితంగా ఉంచుతుంది. మాలిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును తీసుకొస్తుంది. మెడలోని నలుపు పోవాలంటే యాపిల్ సైడర్ వెనిగర్ మెడపై రాస్తూ ఉండాలి. ఇక మెడలోని నలుపును పోగొట్టడానికి రాతి ఉప్పును వాడవచ్చు. మీరు స్నానం చేసే సమయంలో మెడపై రాతి ఉప్పును రుద్దితే నలుపు తగ్గుతుంది. ముందుగా మెడపై ఉప్పు తీసుకుని తేలికపాటి చేతులతో మెడపై మసాజ్ చేస్తుండాలి. మసాజ్ తర్వాత మెడను నీళ్లతో కడిగేయాలి. స్నానం తర్వాత మెడపై మాయిశ్చరైజర్ రాయాల్సి ఉంటుంది.

శనగ పిండి, పసుపు కలిపి పేస్ట్ రాసినా మంచి ఫలితం ఉంటుంది. రెండు టీస్పూన్ల శెనగపిండిలో ఒక టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ బాగా కలపాలి. ఆ పేస్టును మిక్స్ చేసి మెడకు రాయాలి. ఈ పేస్ట్‌ను మెడపై 15 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో మెడను బాగా కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల క్రమంగా మెడపై నలుపు తగ్గిపోతుంది. బంగాళదుంప రసాన్ని నలుపు ఉన్న చోట రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై మచ్చలను తొలగించడంలో బంగాళదుంప అద్భుతంగా పనిచేస్తుంది.

Read Also : Skin Care : చర్మం నిగారింపు కోసం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ లు!