Coronavirus Neutralize : సెకనులోపు కరోనావైరస్‌ను అంతం చేయడం సాధ్యమేనట!
ప్రపంచాన్ని వణికిస్తోన్న COVID-19 కరోనావైరస్‌ను సెకను లోపు అంతం చేయొచ్చుట.. COVID-19ను సెకనులోపు నిలువరించవచ్చా? అంటే పరిశోధక బృందం అవునని అంటోంది. అధిక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అది సాధ్యమని పేర్కొంది.

Neutralizing The Coronavirus In Less Than A Second Is Possible According To This Research
Coronavirus Neutralizing by heating : ప్రపంచాన్ని వణికిస్తోన్న COVID-19 కరోనావైరస్‌ను సెకను లోపు అంతం చేయొచ్చుట.. COVID-19ను సెకనులోపు నిలువరించవచ్చా? అంటే పరిశోధక బృందం అవునని అంటోంది. అధిక ఉష్ణోగ్రత వద్ద మాత్రమే అది సాధ్యమని పేర్కొంది. కరోనావైరస్‌ను 72 డిగ్రీల ఎక్కువ అధిక ఉష్ణోగ్రతల వద్ద బహిర్గతం చేయడం ద్వారా వైరస్‌ను నిలువరించవచ్చునని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్‌లోని టెక్సాస్ ఎ అండ్ ఎం యూనివర్శిటీలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలోని పరిశోధక బృందం ఈ ప్రయోగాత్మక వ్యవస్థను అభివృద్ధి చేసింది.
హాన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. 72 డిగ్రీల సెల్సియస్‌కు బహిర్గతం చేయడం ద్వారా సాధ్యమేనని వివరించారు. కోవిడ్ వైరస్‌ను కనీసం అర సెకను అయినా నిలువరించడం ద్వారా వ్యాప్తిని నిరోధించవచ్చు. వైరస్ కలిగిన స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్ భాగాన్ని వేడి చేసి పరీక్షించారు. SARS-CoV-2ను సాధ్యమైనంత తక్కువ సమయంలో నిలువరించవచ్చునని బృందం కనుగొంది.
COVID-19ను వేడి ద్వారా అణిచివేయడానికి 20 నిమిషాల వ్యవధిలో సాధ్యమే అంటోంది. హాన్, అతని బృందం గాలి ద్వారా SARS-CoV-2 వ్యాప్తిని ఆపడానికి సమర్థవంతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వంటి ఇతర వ్యవస్థలలో దీన్ని అమలు చేయవచ్చునని అంటున్నారు. ఇన్ఫ్లుఎంజా వంటి ఇతర వాయు వైరల్ వ్యాధులను నివారించవచ్చునని అంటున్నారు.