Home Remedies For Pulipirlu : పులిపిర్లు సమస్యతో బాధపడుతుంటే సులభమైన గృహచిట్కాలతో సమస్యను తొలగించుకోండి!

ఒక టీ స్పూన్ ఆముదం నూనెను ఇంకా అర టీ స్పూన్ వంటసోడాను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మీ పులిపిర్ల మీద రాసుకోవాలి.

Home Remedies For Pulipirlu : పులిపిర్లు సమస్యతో బాధపడుతుంటే సులభమైన గృహచిట్కాలతో సమస్యను తొలగించుకోండి!

Home Remedies For Pulipirlu :

Updated On : November 12, 2022 / 9:31 AM IST

Home Remedies For Pulipirlu : పులిపిర్లు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఓబేసిటి, ప్రెగ్నెన్సీ, వయస్సు రిత్యా, జన్యు, హార్మోన్ల మార్పులు, అలెర్జీలు మరియు స్థూలకాయం వంటివి కారణాల వల్ల ఇవి వస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడేవారిలో..రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు, కొన్ని రకాల వైరస్‌లు శరీరంపై దాడి చేస్తాయి. ఈ నేపథ్యంలో కొందరికి పులిపిర్లు ఏర్పడతాయి. పులిపిర్లు తొలగించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది సాంబ్రాణీ కడ్డీలను ఉపయోగించి వాటిని కాలుస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం సరైంది కాదు. దీని వల్ల పండ్లు పండి గాయాలు అవుతాయి. కొన్ని గృహ చిట్కాల ద్వారా పులిపిర్ల సమస్యను తొలగించుకోవచ్చు.

పులిపిర్లు తొలగించుకునేందుకు గృహ చిట్కాలు ;

1. మామిడి ఆకుల రసాన్ని తీసి ఆ రసాన్ని పది రోజులపాటు పులిపిర్ల పైన పూస్తే పూర్తిగా నయమవుతాయట.

2. వెల్లుల్లి మొక్కలను తీసుకొని.. వాటి రసాన్ని తీసి.. అర చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. అలా కలిపిన మిశ్రమాన్ని పులిపిర్ల మీద రాసినట్లు అయితే అవి రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3. తాంబూలంలో వాడి తడి సున్నానికి కొద్దీగా డిటర్జెంట్ పౌడర్ కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. పులిపిర్లపైన రోజువారిగా రాస్తూ ఉంటే వారంరోజుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి.

4.మేడి చెట్టు ఆకుల‌ను లేదా కాయ‌ల‌ను కోయ‌గా వ‌చ్చిన పాల‌ను పులిపిర్లు రాలి పోయే వ‌ర‌కు రోజూ రాస్తూ ఉండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పులిపిర్లకు కార‌ణ‌మ‌య్యే వైర‌స్ న‌శించి పులిపిర్లు వాటంత‌ట అవే రాలిపోతాయి.

5.ఒక టీ స్పూన్ ఆముదం నూనెను ఇంకా అర టీ స్పూన్ వంటసోడాను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు మీ పులిపిర్ల మీద రాసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ ఉండడం వల్ల పులిపిర్లు ఇక 3 నుండి 7 రోజుల వ్యవధిలోనే రాలిపోతాయి.

6. యాపిల్ సిడర్ వెనిగర్ తో పులిపిర్లకి చెక్ పెట్టొచ్చు. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు. వారంలో కనీసం ఐదు రోజులు ఇలా చేస్తే పులిపిర్లు పూర్తిగా మాయమవుతాయి. దీనిలో అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి.

7. కలబందలో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకు మీరు కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురును తీసుకుని పులిపిర్లపై రాస్తే పులిపిర్లు కొద్దిరోజుల్లోనే పోతాయి.