Google Doodle Pani Puri : గల్లీ టూ గూగుల్ వరకు పానీ పూరి
గతంలో పిజ్జా, కిమ్చీ, స్ట్రాబెర్రీలు, బబుల్ టీ వంటి ఫుడ్ ఐటమ్స్‌తో గూగుల్ డూడుల్‌ను రూపొందించింది. తాజాగా పానీ పూరిని గూగుల్ డూడుల్ పెట్టింది. ఇది ఎందుకో తెలుసా?

Google Doodle Pani Puri
Google Doodle Pani Puri : ఇండియాలోనే ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ పానీ పూరిని గూగుల్ డూడుల్‌గా పెట్టింది. పానీ పూరి వరల్డ్ రికార్డ్ సాధించి 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో పానీ పూరీ గేమ్‌ను గూగుల్ తన డూడుల్‌లో తీసుకువచ్చింది.
Google Account : మీ గూగుల్ అకౌంట్ మీకు తెలియకుండా ఎవరు వాడుతున్నారో ఇలా చెక్ చేయండి..!
సరిగ్గా 8 సంవత్సరాల క్రితం అంటే 2015, జూలై 12 న పానీ పూరి ప్రపంచ రికార్డు సాధించింది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఓ రెస్టారెంట్ 51 రకాలైన పానీ పూరిలను తయారు చేసింది. దీంతో పానీ పూరి ప్రపచం రికార్డు కైవసం చేసుకుంది. ఈ రికార్డును గుర్తు చేస్తూ గూగుల్ పానీ పూరి డూడుల్ పెట్టింది. ఇక ఈ సందర్భంలో పానీ పూరి గేమ్‌ను డూడుల్‌లో తీసుకువచ్చింది. ఇలా ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ కాస్తా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. ఈ గేమ్ గురించి చెప్పుకోవాలంటే సౌండ్ ఎఫెక్ట్స్‌తో గేమర్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. అచ్చంగా క్యాండీ క్రష్ ఆటకు దగ్గరగా ఉన్న ఈ పానీ పూరి గేమ్‌ను గూగుల్ డూడుల్ ఏర్పాటు చేసింది. గూగుల్ గతంలో కూడా పిజ్జా, కిమ్చీ, స్ట్రాబెర్రీలు, బబుల్ టీ వంటి ఫుడ్ ఐటమ్స్‌తో గూగుల్ డూడుల్‌ను రూపొందించింది.
హోమ్ పేజీలో గూడుల్ డూడుల్ పై క్లిక్ చేయాలి. టైమ్డ్ లేదా రిలాక్డ్స్ ఆప్షన్లపై క్లిక్ చేసి ఇష్టమైన మోడ్‌ను ఎంచుకోవాలి. పానీ పూరి రుచులపై క్లిక్ చేయడం ద్వారా ఆర్డర్లను పూర్తి చేస్తూ గేమ్ ఆడాలి. ఆలస్యం ఎందుకు ఇక ట్రై చేయండి.