Pomegranate Juice : గ్రీన్ టీ కంటే దానిమ్మ జ్యూస్ హెల్త్ కు బెస్టా?…
గ్రీన్ టీతో పోలిస్తే ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల మూడు రెట్టు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు పొందవచ్చు. శరీరానికి యాంటీ ఇన్ ఫ్లేమేటరీ ఆహారంగా చెప్పొచ్చు.

Pomegranate Juice
Pomegranate Juice : ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణుల అధ్యయనంలో తేలింది. ఎన్నో ఆరోగ్య పరమైన సమస్యలను దానిమ్మ జ్యూస్ ద్వారా అదిగమించవచ్చు. తాజాగా సైంటిస్టులు అధ్యనం ప్రకారం 500 మి.లీ. దానిమ్మ గింజల రసాన్ని ప్రతిరోజూ తాగటం వల్ల వత్తిడిని అధిగమించి తాము చేసే పనిపై ఆసక్తి పెంచుకుంటున్నట్లు గుర్తించారు.
ఆర్ధరైటిస్ తో బాదపడే వారు దానిమ్మ జ్యూస్ అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. డయేరియా, ఐబీఎస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. దానిమ్మ జ్యూస్ గుండెకు మేలు చేయటంతోపాటు కొలెస్ట్ర్రాల్ ను తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడేవారికి ఉపయోగకారిగా చెప్పవచ్చు.
గ్రీన్ టీతో పోలిస్తే ప్రతిరోజు ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగటం వల్ల మూడు రెట్టు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు పొందవచ్చు. శరీరానికి యాంటీ ఇన్ ఫ్లేమేటరీ ఆహారంగా చెప్పొచ్చు. దానిమ్మ జ్యూస్ లో బ్రెస్ట్, ప్రొస్టేట్, స్కిన్ మరియు లంగ్ క్యాన్సర్ ను నివారించే యాంటీ క్యాన్సర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి .చెడు కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అంగస్తంభన లోపం సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ జ్యూస్ తాగితే సమస్య నయమౌతుంది.
వాత , పిత్త , కఫాలను నియంత్రించటంలో దానిమ్మ జ్యూస్ మంచి సహాయకారిగా పనిచేస్తుంది. దానిమ్మలోని విటమిన్ సి వ్యాధినిరోధకతను పెంచడానికి గొప్పగా సహాయపడుతుంది. దగ్గు మరియు జలుబు వంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తిని పుష్కలంగా అంధిస్తుంది.ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు మరియు ఆల్కహాల్ అధికంగా త్రాగే వారు దానిమ్మను అధికంగా తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. కిడ్నీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచడానికి దానిమ్మ గొప్పగా సహాయపడుతుంది.