Ragi Java : ఆరోగ్యానికి మేలు చేసే రాగి ముద్ద, రాగి జావ
రాగిలో మాంసకృత్తులు హెచ్చుగా ఉంటాయి. రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి.

Ragi Sankati
Ragi Java : రాగిజావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాగిజావను రోజుకోసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లగా ఉండటంతోపాటు ఆరోగ్యాపరంగా అనేక లాభాలు చేకూరతాయి. రాగులలో క్యాల్షియం, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ మరియు మినిరల్స్ , అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. కొవ్వులు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అసంతృప్త కొవ్వు కలిగి ఉండటం వల్ల. ఇది చాలా సులభంగా జీర్ణమైవుతుంది. రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. మరియు బరువును నియంత్రణలో ఉంచుతుంది.
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. వీటిలో ఇనుము మోతాదు ఎక్కవగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారు దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. రాగి పిండిలో విటమిన్ సి కూడా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. రాగిజావ వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు రాగులను జావ రూపంలో, సంగటిగా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
రాగిలో మాంసకృత్తులు హెచ్చుగా ఉంటాయి. రాగి పిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. మధుమేహగ్రస్తుల్లో చక్కరస్థాయిలు నియంత్రించడానికి సహాయపడుతుంది.
రాగి సంగటి తయారీ విధానం ;
ముందుగా ఒక బౌల్ లో కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని రెండు సార్లు బాగా కడగాలి. ఒక కప్పు నీటిని పోసి అరగంట సేపు నానబెట్టాలి. అలాగే ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఏ సైజు కప్పులో బియ్యం తీసుకున్నారో అదే సైజు కప్పుతో రాగి పిండినీ తీసుకోవాలి. వెడల్పాటి గిన్నె తీసుకుని నాలుగు కప్పుల నీటిని తీసుకోవాలి. గిన్నెను స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి. నీరు మరిగేసమయంలో నానపెట్టిన బియ్యాన్ని అందులో వేసుకోవాలి.
బియ్యం అన్నంలా మెత్తగా ఉడికిన తరువాత రాగిపిండిని కొద్ది కొద్దిగా వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి కొద్ది సేపు ఉడికించుకోవాలి. తరువాత ఓ గరిటె తీసుకుని రెండు మూడు సార్లు బాగా కలియబెట్టాలి. తక్కువ మంటపై ఐదునిమిషాలు ఉంచి దించివేయాలి. చల్లారినతరువాత ముద్దలుగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. రాగి సంకటికి కాంబినేషన్ గా చికెన్ కర్రీ, పప్పు సాంబర్, టమాటో చట్నీలు రుచికరంగా ఉంటాయి. ఇష్టంగా తినవచ్చు.