Regi Pandu : చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే రేగిపండ్లు
రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Regipandu
Regi Pandu : శీతాకాలంలో లభించే పండ్లలో రేగిపండు ఒకటి. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో రేగిపండ్లు తినటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రోగనిరోధకశక్తి పెంచటంలో రేగిపండ్లు బాగా దోహదపడతాయి. వీటిల్లో విటమిన్ సి, ఏ పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో జలుబు, దగ్గు లాంటి సమస్యలు సహజం. అయితే ఈ కాలంలో ఈ సమస్యల నుండి రక్షించడానికి సహాయపడతాయి. నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా ఈ పండ్లను తింటే నిద్ర లేమి సమస్య నుండి బయట పడొచ్చు. రేగిపండ్లను తొక్కతో పాటూ తినడం వల్ల కాలేయానికి చాలా మంచిది.
రేగుపళ్లు చెడు కొవ్వును కరిగించడమే కాకుండా ఆకలిని పెంచుతాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వగల రేగు పండ్లను బలహీనంగా ఉన్న వారు తినడం చాలా మంచిది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా రేగిపండ్లు కీలక పాత్రనే పోషిస్తాయి. రేగుపండ్లు తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగడం కోసం, రక్తం ఉత్పత్తిని పెంచటంలో సహాయపడతాయి. చలికాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రేగుపండ్లు శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి.
విరేచనాల తో బాధ పడుతున్న వారు రేగి చెట్టు బెరడును తీసి కషాయంలా చేసి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చర్మం పై బొబ్బలు, కురుపులు వచ్చి బాధిస్తుంటే రేగు పండు ఆకులను నూరి చర్మం పై రాసుకోవడం వలన వెంటనే నయమవుతాయి. రేగి పండ్లు కాలేయానికి సంబందించిన సమస్యలను నయం చేసి మరింత మెరుగ్గా పని చేసేలా చేయగలవని పరిశోధనల్లో తేలింది. కఫము, పైత్యము, వాతం లాంటి సమస్యలు బాధిస్తుంటే రేగి పండ్లు చక్కని పరిష్కారం చూపిస్తాయి.
రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో రేగిపండ్లు కీలకపాత్రవహిస్తాయి. రేగు పళ్లని ఎండపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తింటారు.
ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది. రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ చిన్న రేగు పండ్లలో ఉండే మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి రేగి తీసుకోవడం మంచిది. మల్లబద్దకం ఉన్నవారికి రేగిపండు మరీ మంచిది. శారీరిక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా రేగుపండ్లు ఉపయోగపడతాయి. రేగిపండ్లలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా రేగుపండ్లు బెస్ట్. చర్మంపై ముగతలను పోగొట్టి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి రేగుపండ్లు.