Eat Breakfast : ఉదయం అల్పాహారం తినకుంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం?

ఉదయం అల్పాహారం తినే వారితో పోల్చితే తినకుండా మనేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది.

Eat Breakfast : ఉదయం అల్పాహారం తినకుంటే ఊబకాయం బారిన పడే ప్రమాదం?

Risk of obesity if you don't eat breakfast in the morning?

Updated On : February 14, 2023 / 9:52 AM IST

Eat Breakfast : ప్రతి రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తిననివారు ఊబకాయం బారిన పడే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ మానేయడం వల్ల సన్నబడతామనే చాలామంది అభిప్రాయం తప్పని అంటున్నారు. ఉదయం అల్పాహారంగా ప్రొటీన్లతో కూడిన బ్రేక్‌ఫాస్ట్‌ని మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోవడం వల్ల ఆకలి ఎక్కువగా ఉండి మధ్యాహ్నం , రాత్రి డిన్నర్‌లలో ఎక్కువ పరిమాణంలో ఆహారం తినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌ తినకపోతే సన్నబడ్డం మాట పక్కన ఉంచితే లావు అయ్యే ప్రమాదం ఎక్కువ ఉందని పలు పరిశోధనల్లో తేలింది.

ముఖ్యంగా చదువుకునే చిన్నారులకు చాలా మంది తల్లిదండ్రులు ఉదయం ఒక గ్లాసు పాలతో సరిపెడుతుంటారు. ఇలా చేయటం ఏమాత్రం సరైనది కాదు. ఉదయం పూట కచ్చితంగా అల్పాహారం పిల్లలకు తినిపించాలి. పిల్లల ఎదుగుదలపై అది ప్రభావం చూపుతుంది. పిల్లల మానసిక వికాసానికి పోషకాలున్న అల్పాహారం తీసుకోవటం చాలా అవసరం.

అల్పాహారం రోజువారిగా తినేవారు అధిక బరువు, ఊబకాయం సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారని, అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఉదయం తినడం వల్ల గ్లైకోజెన్‌ను పునరుద్ధరించడానికి మరియు ఇన్సులిన్ స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. అల్పాహారం తినడం ద్వారా రోజంతా ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి శరీరాన్ని ప్రోత్సహించవచ్చని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి.

ఉదయం అల్పాహారం తినే వారితో పోల్చితే తినకుండా మనేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేలింది. అంతే కాకుండా టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలింది.

బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో శక్తి లేక తరచుగా అలసటకు గురవుతారు. అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.