గొడవ పడే జంటల్లోనే రొమాన్స్ పీక్స్!

ఇది నిజం. రోజూ గొడవలు పడే జంటలే ఎక్కువ కాలం కలిసి ఉంటాయని సర్వే చెబుతుంది. అప్పలాచియన్ స్టేట్ యూనివర్సిటీ కథనం ప్రకారం.. ‘ఎవరైతే ఒకరినొకరు రోజూ నిందించుకుంటూ ఉంటారో వాళ్లే రొమాన్స్‌లో పీక్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తారు’ అని రీసెర్చ్ చెబుతుంది. అలా అని ఎంజాయ్‌మెంట్ కోసం గొడవలు పడితే మాత్రం హద్దులు మీరకుండా జాగ్రత్త పడాలి సుమా..
ఇద్దరూ తరచుగా గొడవలు పడే క్షాణాల్లో సాధ్యమైనంత వరకూ సంభాషణను ఫన్నీగా ముగించడానికే ప్రయత్నించాలి. చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపుతూ పార్టనర్ ప్రేమను గెలవడానికి చొరవ చూపించాలి. ఏదైతే మీ భాగస్వామిలో బెస్ట్ అనుకుంటున్నారో దానిని ఎదుటివారితో పోలుస్తూ మాట్లాడితే వారిని రెచ్చగొట్టినట్లవుతుంది.
ఈ థియరీ 15వేల మందిపై 39పరిశోధనల ఫలితంగా దీనిని నిర్ధారించారు. చాలా వరకూ పార్టనర్‌లో సెన్సాఫ్ హ్యుమర్ కోసమే వెదుకుతుంటారు. మీరు ఎంత ఫన్నీగా ఉంటున్నారనే దానిపైనే మీ బంధం ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ కలిసి గడిపిన సంతోష సమయమే బంధానికి మరింత బలం చేకూరుస్తుంది.