Russia Clinical Trials : అస్ట్రాజెనెకా/స్పుత్నిక్ V టీకాతో క్లినికల్ ట్రయల్స్‌కు రష్యా గ్రీన్ సిగ్నల్!

ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ షాట్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తో కలిపి సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రష్యా స్టేట్ డ్రగ్ రిగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది.

Russia Clinical Trials : అస్ట్రాజెనెకా/స్పుత్నిక్ V టీకాతో క్లినికల్ ట్రయల్స్‌కు రష్యా గ్రీన్ సిగ్నల్!

Russia Approves Trials Of Combined Astrazeneca Sputnik V Vaccine

Updated On : July 27, 2021 / 11:24 AM IST

Russia Clinical Trials : ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ షాట్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తో కలిపి సంయుక్తంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు రష్యా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రష్యా స్టేట్ డ్రగ్ రిగ్యులేటర్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ క్లినికల్ ట్రయల్స్ కోసం ఆమోదం ప్రక్రియను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎథికల్ కమిటీ మే నెలలో నిలిపివేసింది.

స్టేట్ డ్రగ్ రిజిస్టర్ ప్రకారం.. ఐదు రష్యన్ క్లినిక్‌లకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నాయి. 2022 మార్చి ప్రారంభంలో ఈ ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆస్ట్రాజెనెకా / ఆక్స్ ఫర్డ్ స్పుత్నిక్ V టీకాలు రెండూ రెండు మోతాదులు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇందులో ప్రారంభ షాట్, ఒక బూస్టర్ డోసు ఇవ్వాలి. కానీ, స్పుత్నిక్ V టీకాకు రెండు షాట్ల కోసం వేర్వేరు వైరల్ వెక్టర్లను వాడే అవకాశం ఉంది. క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాలనే నిర్ణయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (RDIF) స్వాగతించింది. ప్రస్తుతం, స్పుత్నిక్ V, స్పుత్నిక్ లైట్ టీకాలను విదేశీ టీకాలతో కలిపేందుకు RDIF ఉమ్మడి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొంది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఇతర వ్యాక్సిన్‌లతో కలిపి వినియోగించనున్నారు.

ఇలా చేయడం ద్వారా వైరస్ మ్యుటేషన్లపై ప్రభావంతంగా పనిచేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వైరల్ వెక్టర్ షాట్లుగా పిలిచే భవిష్యత్తులో కరోనా నుంచి రోగనిరోధక శక్తిని పెంచే జన్యు సమాచారాన్ని సేకరిస్తాయి. అస్ట్రాజెనీకా / ఆక్స్ ఫర్డ్ షాట్‌ను స్పుత్నిక్ Vతో కలిపి హ్యుమన్ ట్రయల్స్ నిర్వహించేందుకు అజర్‌బైజాన్‌లో ఇప్పటికే ఆమోదం లభించింది. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బెలారస్ అర్జెంటీనాలో కూడా ఆమోదం పొందాయి.