Sapota : కంటి చూపును పెంచి…శరీరానికి శక్తినిచ్చే సపోటా
సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఉధృతిని, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా బాగా పనిచేస

Sapota1
Sapota : ప్రకృతి సిద్ధంగా లభించే వాటిల్లో సపోటా అద్భుతమైన రుచిని అందించే పండ్లలో ఒకటి. ఇది అధిక పోషకాలు కలిగిఉన్న పండు. ఈ పండు రుచికరమైన గుజ్జు వల్ల తేలికగా జీర్ణమై, గ్లూకోస్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. రుచి తియ్యగా ఉండడం వల్ల, జ్యూస్‌గా కూడా చేసుకుని తాగుతారు. జామ పండ్ల కన్నా సపోటా చాలా తియ్యగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పోషక విలువలు కూడా ఉంటాయి. ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ మరియు ఈ, రాగి, ఇనుము మొదలైన ఖనిజ లవణాలు ఉంటాయి.
సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్‌ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. సపోటా విటమిన్ ఎ ని అధికంగా కలిగి ఉంటుంది. విటమిన్ ఎ వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందువల్ల, మంచి దృష్టిని పొందడానికి సపోటా పండు బాగా ఉపయోగపడుతుంది. సపోటాలో పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలం. దానివల్ల సపోటా తినడం వల్ల గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషక విలువలు త్వరగా అందుతాయి. వీరిలో శక్తిని పెంచుతుంది.
సపోటా టన్నిన్‌ని అధికంగా కలిగి ఉండడం వల్ల ముఖ్యమైన యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఎసోఫాగిటిస్, పేగు శోధము, చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారణ ద్వారా జీర్ణ వాహిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఎటువంటి వాపునైనా, నొప్పినైనా తగ్గించడం ద్వారా మంటను కూడా తగ్గిస్తుంది. తరచుగా సపోటా తినడం, లేక సపోటా జ్యూస్ తాగడంగానీ చేస్తే జుట్టు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తల వెంట్రుకలకు పోషకాలు అందుతాయి.
సపోటా పండు శక్తివంతమైన ఉపశమనకారి కావడం వల్ల నరాల ఉధృతిని, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అందువల్ల, ఇది నిద్రలేమి, ఆందోళన, వ్యాకులతతో బాధపడుతున్న వ్యక్తులకు సపోటా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, బి శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు సహాయపడతాయి. సపోటా లోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు కాన్సర్ ను౦చి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ ఎ ఊపిరితిత్తులు, నోటి కాన్సర్ నుండి రక్షణను అందిస్తుంది. దీనిలోని పీచు పదార్ధం మలబద్ధకం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
సపోటా తింటే విటమిన్-A లభిస్తుంది. విటమిన్- ఏ కంటిచూపును పెంచుతుంది. కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. పొటాషియం, ఇనుము, ఫోలేట్, నియాసిన్, పాంతోతేనిక్ జీర్ణ వ్యవస్థకు సరైన చర్యలైతే విటమిన్ సి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేస్తుంది. సపోటా పండు చర్మం కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుంది. ఈ పండులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని తేమగా ఉంచడం వల్ల, చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల, సపోటా పండు తినడం అనేది చర్మానికి ఎంతో మంచిది.
రోగనిరోధక శక్తి పెంచుతుంది. సపోటాలో ఉండే విటమిన్లు, పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు కొంతమేర పరిష్కారం చూపుతుంది. సపోటా విత్తనాలను ఆముదంతో కలిపి, ఒక పేస్ట్‌లా తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేయండి. దీనివల్ల మీ జుట్టు మృదువుగా ఉండి, చుండ్రు సమస్యను నియంత్రిస్తుంది.శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. క్రీడాకారులకు ఎంతో శక్తి అవసరం అందువల్ల, వారిని సపోటా పండు తినమని సిఫార్సుచేయబడింది.
గర్భం సమయంలో వచ్చే వికారం, మైకం వంటి ఇతర లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. చాతీ పట్టేసినపుడు, దీర్ఘకాల దగ్గు ఉన్నపుడు ముక్కు నాళాలలో నుండి దగ్గు, శ్లేష్మం తొలగించడం ద్వారా వాటిని దూరంగా ఉంచుతుంది. అందువల్ల, ఇది జలుబు, దగ్గు తగ్గడానికి దోహదంచేస్తుంది. సపోటా విత్తనం పొడి మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ళను తొలగించడానికి సహాయపడి, మూత్రవిసర్జన కారకంగా పనిచేస్తుంది. అలాగే ఇది మూత్రపిండాల వ్యాధుల నుండి రక్షణను అందిస్తుంది.