Sniffer Dog : వాసనతో కుక్క నిందితుడిని ఎలా పట్టిస్తుంది?
కుక్కలు వాసనతో నిందితుడిని పట్టిస్తాయి. ఎక్కడో నీటి అడుగున ఉన్న డెడ్ బాడీస్‌ని కూడా గుర్తిస్తాయి. అంతేనా రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని కూడా ముందుగానే పసిగడతాయట. కేవలం వాసనతో వీటికి ఇవన్నీ ఎలా సాధ్యం?

Sniffer Dog
Sniffer Dog : ఏదైనా నేరం జరిగినపుడు పోలీసులు కుక్కలను రంగంలోకి దించుతారు. నిందితులను పట్టించడంలో అవి కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. కేవలం వాసన ద్వారా నిందితులను పట్టిస్తాయి. ఇది ఎలా సాధ్యం? అంటే వీటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
చాలా క్రైంలలో నిందితుల్ని పట్టుకోవడంలో శునకాలు సహాయం చేస్తాయి. అయితే వీటికి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. కేవలం వాసన ద్వారా నిందితుల ఆచూకీ లేదా వారి డెడ్ బాడీలను పసిగట్టగల సామర్థ్యం వాటికి ఉంటుంది. తాజా అధ్యయనం ప్రకారం శునకాలు 80% నుంచి 90% వరకు తప్పు వ్యక్తిని , తప్పు నమూనాను చూపించలేదని కనుగొన్నారు. అయితే ఇవి వాసనతో నిందితుల్ని ఎలా పసిగడతాయి అంటే..?
మీరు ఏదైనా వస్తువుని తాకినప్పుడు, ఎక్కడైనా కూర్చున్నప్పుడు మీ శరీరం తాలుకూ వాసనలు వాటిపై వదులుతారు. ఒక్కొక్కరి బాడీ తీరును బట్టి ఈ వాసన డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ వాసన చాలా రోజుల వరకూ వాటిపై ఉంటుందట. సేకరించిన వాసన ద్వారా నిందితుల్ని గుర్తించడంలో కుక్కలు సహాయపడగలవు. అంచనాల ప్రకారం మన ముక్కులో 5 మిలియన్ సువాసన గ్రాహకాలు ఉంటే.. ఒక జర్మన్ షెపర్డ్ డాగ్‌లో దాదాపుగా 225 మిలియన్ల కంటే ఎక్కువగా సువాన గ్రాహకాలు ఉంటాయట. ఫోరెన్సిక్ నిపుణులు నేరం జరిగిన ప్రదేశం నుంచి వాసనను సేకరిస్తారు. ఇది వస్తువులు కావచ్చు, మొబైల్ ఫోన్, లేదా కాటన్ ప్యాడ్‌లు కావచ్చు. వీటిని చాలాకాలం పాటు నిల్వ ఉండే ప్రదేశంలో భద్రపరుస్తారు.
Agra : గుండెలు పిండే విషాదం.. కారులో ఊపిరాడక చనిపోయిన శునకం, వాళ్లసలు మనుషులేనా? ఏం చేసినా పాపం లేదు
సేకరించిన వాసనలను డాక్ పసిగడుతుంది. వాసనలు సరిపోలినపుడు నిందితుడిని పట్టుకోవడం ఈజీ అవుతుంది. 18 నుంచి 20 నెలల శిక్షణ తీసుకున్న కుక్కలు 85% ఖచ్చితంగా నేరస్తుడిని కనుగొన్నాయని పరిశోధనలో తేలిందట. అయితే ఇలాంటి పరీక్షలు చేసేటపుడు రెండు శునకాలతో రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన తరువాత రెంటినీ సరిపోల్చి అప్పుడు నిర్ధారణకు వస్తారట.