Ayurvedic Fertility Supplements : గర్భధారణకు ఆయుర్వేద సంతానోత్పత్తి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా ? ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలు తప్పవా ?

పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు ,ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ వంటి అవసరమైన పోషకాల మూలాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి.

Ayurvedic Fertility Supplements : గర్భధారణకు ఆయుర్వేద సంతానోత్పత్తి సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా ?  ప్రమాదకరమైన ఆరోగ్యసమస్యలు తప్పవా ?

Ayurvedic fertility supplements

Updated On : September 25, 2023 / 10:39 AM IST

Ayurvedic Fertility Supplements : మహిళకు మాతృత్వం అనేది ఒక వరం వంటిది. వివాహం అయినప్పటి నుంచి అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాట పడిపోతారు. గర్భం దాల్చానన్న కోరికను కలిగి ఉంటారు. గర్భం అనేది ఒక సున్నితమైన ప్రయాణం. ఒక లోతైన , సంక్లిష్టమైన ప్రక్రియ. అయితే చాలా మందిలో గర్భం రావటంలో ఆలస్యం జరుగుతుంది. అలాంటి వారిలో కొందరు వైద్యులను సంప్రదిస్తుండగా మరికొందరు మాత్రం నాటు వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆయుర్వేద మందులు తీసుకునే సాంప్రదాయం ఎంతో కాలంగా పాతుకుపోయినప్పటికీ, వాటిని తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య భద్రత అవసరమైన శాస్త్రీయ ధృవీకరణను కలిగి ఉండవు.

READ ALSO : Telangana : డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!.. తాత్కాలిక ఎలక్షన్ షెడ్యూల్

గర్భధారణ కోసం మనం తీసుకునే ప్రతి నిర్ణయం, చర్య సున్నితమైన గర్భధారణ అద్దం పడుతుంది. గర్భధారించే విషయంలో అనేక అంశాలు ముఖ్యమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆహార నిర్ణయాల పరంగా, గైనకాలజిస్ట్‌ల సూచనలు పాటించటం మంచిది. ఏవైనా సప్లిమెంట్లను తీసుకునేటప్పుడు, అవి ఆయుర్వేదమైనా లేదా మరేదైనా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం.

పోషకాహారం పై ప్రధానంగా దృష్టి పెట్టటం ;

పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు ,ఫోలిక్ యాసిడ్ మరియు ఐరన్ వంటి అవసరమైన పోషకాల మూలాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే కొన్ని సందర్భాల్లో ఫోలిక్ యాసిడ్, ఐరన్ వంటి కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు. వాటిని తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల అవాంఛిత దుష్ఫలితాలు ఏర్పడవచ్చు. గర్భం అనేది ఒక ప్రత్యేకమైనది. ఆరోగ్య సంరక్షణ నిపుణుల మార్గదర్శకత్వంలో వాటిని తీసుకోవటం మంచిది.

READ ALSO : YS Sharmila : వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ బంపర్ ఆఫర్..! త్వరలో విలీనంపై అధికారిక ప్రకటన

ప్రమాదాలు కలిగించే ఆయుర్వేద సప్లిమెంట్లు ;

ఆయుర్వేద సంతానోత్పత్తి సప్లిమెంట్‌ల వినియోగం ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ప్రధానంగా ఈ సప్లిమెంట్‌లలో సీసం మరియు పాదరసం వంటి ప్రమాదకరమైన భారీ లోహాలు కూడా ఉండవచ్చు. ఇది సంతానోత్పత్తి సమస్యలతో సహా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి, సంతానోత్పత్తికి , ఆరోగ్యకరమైన గర్భధారణకు శాస్త్రీయ ఆధారిత పద్ధతులను ఎంచుకోవటం మంచిది.

READ ALSO : Ari Mactans : ‘వాళ్లకు దెబ్బలు కావాలి నాకు డబ్బులు కావాలి’ మగవాళ్లను టార్చర్ చేసి భారీగా సంపాదిస్తున్న ముద్దుగుమ్మ

సహజంగా సంతానోత్పత్తిని పెంచడానికి హెర్బల్ సప్లిమెంట్స్‌లోని పదార్థాలను తీసుకోబోయే ముందు వాటిలో నిక్షిప్తమైన ఉన్న వాటి గురించి తెలుసుకోవటం మంచిది. వీటన్నంటికంటే సరైన పోషకాహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా, సంతానోత్పత్తికి ఆహార ఎంపికలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారం. , ఐరన్, ఒమేగా 3 మరియు ఫోలిక్ యాసిడ్ వంటి వాటిని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.