Arundhati Star : పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా?
పెళ్లైన వెంటనే భర్త భార్యకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అరుంధతి నక్షత్రం నిజంగానే కనిపిస్తుందా? అరుంధతి నక్షత్రాన్ని చూపించడం వెనుక అర్ధం ఏంటి?

Arundhati Star
Arundhati Star : పెళ్లి వేడుకలో భర్త భార్యకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. పెళ్లిలో ఇది ఒక సంప్రదాయం. అయితే ఎందుకు అలా చూపిస్తాడు? దాని వెనుక ఉన్న అర్ధం ఏంటి?
అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మ రుతువుల్లో సాయంకాలం సమయంలో, మిగిలిన కాలాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత లేదా తెల్లవారు ఝామున ఈ నక్షత్రం కనిపిస్తుంది. ఆకాశంలో తూర్పు వైపున అరుంధతీ, వశిష్ట అనే రెండు నక్షత్రాలు దగ్గరగా ఉంటాయని చెబుతారు. ఈ నక్షత్రాలను అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా చెబుతారు. అందుకే వివాహమైన తరువాత జంటలను నక్షత్రాలు చూడవలసిందిగా పూజారి చెబుతారు. వశిష్ఠ, అరుంధతి జంటలాగ కలకాలం జీవించాలని ఈ సందర్భంలో కొత్త జంటను ఆశీర్వదిస్తారు.
అసలు అరుంధతి ఎవరు అంటే.. పురాణాల ప్రకారం అరుంధతి కశ్యపుని కుమార్తె. ఒకసారి అగ్నిదేవుడికి సప్త ఋషుల భార్యలతో కాపురం చేయాలని కోరిక కలిగిందట. ఈ విషయం అతని భార్య స్వాహా దేవికి తెలిసింది. ఆమె ఋషి భార్యల రూపాలను ధరించి అగ్నితో ప్రేమలో పడుతుంది. అయితే భర్త పట్ల ఎంతో అంకిత భావం ఉన్న అరుంధతి రూపాన్ని పొందడంలో విఫలమవుతుంది. ఏడుగురు ఋషులు విషయం తెలుసుకుని తమ భార్యల పవిత్రతను శంకిస్తారు. ఇక వశిష్టుడు తన భార్యపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎందుకంటే వారిద్దరు ఒకరిపై ఒకరు నమ్మకంతో విధేయులుగా ఉన్నారు. ఈ జంట మాదిరిగా భార్యాభర్తలు ఒకరికొకరు విధేయులుగా ఉండాలని .. వశిష్ట, అరుంధతి నక్షత్రాలను చూడాలని చెబుతారు.
Old Man Dance Goes Viral : మనవడి పెళ్లిలో 96 ఏళ్ల వృద్ధుడు చేసిన డ్యాన్స్ చూస్తే నోరెళ్లబెడతారు
అరుంధతి నక్షత్రం వెనుక ఖగోళ సత్యం ఉంది. వశిష్ట, అరుంధతి ఖగోళ నామం వరుసగా మిజార్, అల్కోర్. సప్తర్షి మండలంలో రెండు ఒకదానికొకటి పక్కన ఉంటాయి. వీటిని బిగ్ డిప్పర్ అంటారు. టెలిస్కోప్ ద్వారా వీటిని పరిశీలిస్తే మిజార్‌కి దగ్గరలో అల్కోర్ చిన్న చుక్కగా కనిపిస్తుంది. వీటిని గుర్రం, మరియు రైడర్ అని పిలుస్తారు. గెలీలియో కూడా వీటిని గుర్తించాడు. రెండు నక్షత్రాలు కలిసి కదులుతున్నాయని పేర్కొన్నాడు.