Eating Okra : ప్రెగ్నెన్సీ సమయంలో బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

బెండకాయలో ఉండే విటమిన్ సి పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విటమిన్ తల్లికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే పిల్లల ఎముకలు, కండరాలను బలపరుస్తుంది.

Eating Okra : ప్రెగ్నెన్సీ సమయంలో బెండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే!

These are the benefits of eating okra during pregnancy!

Updated On : September 26, 2022 / 8:06 AM IST

Eating Okra : కూరగాయల్లో బెండకాయ ఒకటి. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే దీనిని రోజువారి ఆహారంలో చేర్చుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గర్భవతిగా ఉన్నవారు బెండకాయను ఆహారంగా తీసుకోవటం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. బెండకాయలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలతోపాటు సి,ఎ, ఇ,కె విటమిన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు దోహదం చేసే పీచు కూడా ఉంటుంది. బెండకాయ ఫైబర్‌తో నిండి ఉంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. కరగని ఫైబర్ కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, పోషకాలు శరీరంలో బాగా శోషించబడతాయి.

గర్భవతిగా ఉన్నప్పుడు బెండకాయ తినడం వల్ల పిండం ఎదుగుదల బావుంటుంది. ఫోలేట్ అనే పోషకం సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భధారణ జరిగిన నాలుగు నుంచి పన్నెండు వారాల లోపు ఈ పోషకాలు చాలా అవసరం. దీని వియోగంతో తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

బెండకాయలో ఉండే విటమిన్ సి పిల్లల పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ విటమిన్ తల్లికి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అలాగే పిల్లల ఎముకలు, కండరాలను బలపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న బెండకాయ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కెరోటినాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు హృదయనాళ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బెండకాయ పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లను నివారిస్తుంది. దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది.

బెండకాయ తింటే అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు వారానికోసారయినా తింటే మంచిది. చర్మకాంతిని మెరుగుపరిచి, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.ముఖ్యంగా ట్రై గ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ లను తగ్గించటంలో బెండకాయ కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఇక పోతే బెండకాయను వండే ముందు బాగా కడగాలి. ఇది వ్యాధుల సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పోషకాల నష్టాన్ని నివారించడానికి తక్కువ మంట మీద ఉడికించాలి.