Foods To Help Stress : చిరాకు, అసహనంతో ఉన్న సందర్భంలో మీ మనస్సుకు ప్రశాంతత చేకూర్చే ఆహారాలు ఇవే!

బీన్స్, కాయధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా చేయడంతో పాటుగా ఉత్సాహంగా ఉంచుతాయి.

Foods To Help Stress : చిరాకు, అసహనంతో ఉన్న సందర్భంలో  మీ మనస్సుకు ప్రశాంతత చేకూర్చే ఆహారాలు ఇవే!

These are the foods that will calm your mind in case of irritation and impatience!

Updated On : October 20, 2022 / 3:19 PM IST

Foods To Help Stress : మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవడం వల్ల శరీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. డల్ గా , చిరాకుగా, అసహనంతో ఉన్న సందర్భాల్లో ఏదిపడితే అది తినేస్తుంటారు. ఏమి తింటున్నామో, ఎంత మోతాదులో తింటున్నామో అన్న విషయం కూడా ఆలోచించరు. దీని వల్ల సమస్య తగ్గకపోను కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భంలో మీ మూడ్ ను మార్చి మనస్సు ప్రశాంతత చేకూర్చే ఆహారాలను తీసుకోవటం అవసరం. అలాంటి వాటికి సంబంధించిన అవగాహన కలిగి ఉండటం అవసరం.

హ్యాపీ మూడ్ ను కలిగించే ఆహారాలు ;

1. నట్స్ ; నట్స్ లో ఎన్నో పోషకాలుంటాయి. రోజూ గుప్పెడు గింజలను తింటే శరీరంలో విటమిన్ల లోపం పోతుంది. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. మూడ్ బాగాలేనప్పుడు కొన్ని గింజలను నమలడం వల్ల హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు. ఇవి డిప్రెషన్ ను కూడా తగ్గిస్తాయి. నైట్ షిఫ్ట్ లో పని చేసేవారు మధ్యమధ్యలో వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుంది.
అరటిపండ్లు

2. అరటిపండ్లు ; మన ఆరోగ్యానికి చాలా అవసరం. వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ బి6, చక్కెర, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పండ్ల మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తాయి. వీటిని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

3. బీన్స్, కాయధాన్యాలు ; బీన్స్, కాయధాన్యాల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని శక్తివంతంగా చేయడంతో పాటుగా ఉత్సాహంగా ఉంచుతాయి.

4. ఓట్స్ ; ఓట్స్ బరవును తగ్గించేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఓట్స్ ను తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అంతేకాదు ఓట్స్ మధుమేహులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఓట్స్ లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మిమ్మల్ని శక్తివంతంగా చేస్తుంది. హ్యాపీ మూడ్ లోకి మారిపోతారు.

5. డార్క్ చాక్లెట్స్ ; డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోపడతాయి. వీటిని తింటే మూడ్ ఆటోమెటిక్ గా ఛేంజ్ అవుతుంది. ఒక చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ గా చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే సమ్మేళనాలు డోపమైన్ ను పెంచేందుకు సహాయపడతాయి. దీంతో మీరు మరింత హ్యీపీ మూడ్ లో కి మారిపోతారు.