Popular Indian Foods : అంతర్జాతీయ సూపర్‌ఫుడ్‌లకు ప్రత్యామ్నాయాలుగా ప్రాచుర్యం పొందిన భారతీయ ఆహారాలు ఇవే !

బ్లూబెర్రీస్ ఆహారంగా తీసుకుంటే మంచి పోషకాలు సొంతం చేసుకోవచ్చు. అయితే అవి ఖరీదైనవి మరియు అన్ని సమయాలలో సులభంగా అందుబాటులో ఉండవు. నేరేడు పండు ప్రస్తుతం అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది. బ్లూబెర్రీలలో ఉండే పోషకాలు అన్నీ ఈ నేరేడు పండులో ఉన్నాయి.

Popular Indian Foods : అంతర్జాతీయ సూపర్‌ఫుడ్‌లకు ప్రత్యామ్నాయాలుగా ప్రాచుర్యం పొందిన భారతీయ ఆహారాలు ఇవే !

popular Indian foods

Updated On : May 11, 2023 / 11:06 AM IST

Popular Indian Foods : గ్లోబల్ ఫుడ్ ట్రెండ్‌ల నేపధ్యంలో కొన్ని రకాల సూపర్‌ఫుడ్‌లు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. దీంతో అందరి దృష్టి వాటివైపే ఉంటుంది. కొత్త అభిరుచులు కోరుకునే వారికి మన భారతదేశంలో మన పెరట్లో లభించే సూపర్ ఫుడ్ లు కనిపించటం లేదు. తాతముత్తాల కాలం నుండి స్ధానికంగా లభించే అనేక పోషకాలతో కూడిన ఆహారాలు ఆరోగ్యంగా జీవించేందుకు తోడ్పడ్డాయి. ఇతర దేశాల్లోని ఆహారాల్లాగానే వీటిలో కూడా అనేక పోషక గుణాలు ఉన్నాయి. పైగా తక్కువ ఖర్చుతో ఇవి మనకు అందుబాటులో ఉంటాయి.

READ ALSO : Bowel Cancer : ప్రేగు క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు !

అంతర్జాతీయ సూపర్‌ఫుడ్‌లకు భారతీయ ప్రత్యామ్నాయ ఆహారాలు ఇవే ;

1. అవకాడో స్థానంలో కొబ్బరి ;

అవోకాడోలు బహుళ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ, భారతదేశంలో చాలా మంది రోజూ తినడానికి అవి ఖరీదైనవి. వాటికి బదులుగా మనదేశంలో సులభంగా లభించే కొబ్బరిని తీసుకోవచ్చు. కొబ్బరిని మిరాకిల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దాని అధిక పోషక సాంద్రత. ఈ ఉష్ణమండల పండులో కరగని ఫైబర్, మాంగనీస్, పిండి పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్ మరియు చిన్న మొత్తంలో B విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.

2. బ్లూబెర్రీల స్ధానంలో నేరేడు ;

బ్లూబెర్రీస్ ఆహారంగా తీసుకుంటే మంచి పోషకాలు సొంతం చేసుకోవచ్చు. అయితే అవి ఖరీదైనవి మరియు అన్ని సమయాలలో సులభంగా అందుబాటులో ఉండవు. నేరేడు పండు ప్రస్తుతం అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది. బ్లూబెర్రీలలో ఉండే పోషకాలు అన్నీ ఈ నేరేడు పండులో ఉన్నాయి. మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్లూబెర్రీలకు గొప్ప ప్రత్యామ్నాయంగా నేరేడును చెప్పవచ్చు.

READ ALSO : వేసవిలో మధుమేహులు తీసుకోదగిన పానీయాలు..ఆహారాలు

3. చియా విత్తనాల స్ధానంలో అవిసె గింజలు ;

చియా విత్తనాలు,సబ్జా, అవిసె గింజలు ఒకేలా కనిపించినప్పటికీ, అవి భిన్నంగా ఉంటాయి. రెండూ ఒకే పుదీనా కుటుంబానికి చెందినవి. దాదాపు సమానమైన ప్రోటీన్ మరియు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. అయితే, చియా గింజలు సబ్జా కంటే తక్కువ సంఖ్యలో కేలరీలను కలిగి ఉంటే, అవిసె గింజలు అధిక మొత్తంలో రాగి, పొటాషియం కలిగి ఉంటాయి.

4. కాలే స్ధానంలో పాలకూర ;

కాలే వంటి అన్యదేశ సూపర్‌ఫుడ్‌లపై ఆధారపడి బరువు తగ్గే పనిలో ఉన్నట్లయితే, మనదేశంలో లభించే బచ్చలికూర వంటి ఆరోగ్యకరమైన ఆకుకూరలతో బరువు సులభంగా తగ్గవచ్చు. ఇది మార్కెట్‌లో సులభంగా దొరుకుతుంది. కాలే కంటే ఎక్కువ ఫోలేట్ మరియు విటమిన్లు A మరియు K తో నిండి ఉంటుంది. బచ్చలికూర , కాలే రెండూ బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బచ్చలికూర పోషకాహారానికి పవర్‌హౌస్ గా చెప్పవచ్చు.

READ ALSO : Protect Your Skin : సూర్యుని నుండి మీ చర్మాన్ని రక్షించే ఆహారాలు !

4. చైనీస్ జిన్సెంగ్ స్ధానంలో అశ్వగంధ ;

చైనీస్ జిన్సెంగ్ లైంగిక సామర్థ్యం కోసం ఉపయోగించబడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పదార్ధం. దానికి సమానమైన భారతీయ ఔషదంగా అశ్వగంధ ప్రాచుర్యం పొందింది. ఇది శరీరాన్ని బలోపేతం చేయడానికి , లైంగింక సామర్ధ్యం పెంపొందించటానికి తోడ్పడుతుందని ఆయుర్వేదంలో బాగా ప్రాచుర్యం పొందింది. దీని సారం నరాలకు శక్తినిస్తుంది. కండరాలను బలపరుస్తుంది.