Beauty Secrets : ఈ బ్యూటీ సీక్రెట్స్ మహిళలకు మాత్రమే!
చాలా మంది అందంగా కనిపిచేందుకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంటారు. బ్యూటీ పార్లర్ కు వెళ్ళే వాళ్లందరు అందంగా కనిపిస్తారనుకోవటం పొరపాటే అవుతుంది. వేసుకునే దుస్తులు, హెయిర్ స్టైల్, మేకప్ కారణంగా అందంగా కనిపించవచ్చు. అయితే ఇది సహాజ సిద్ధమైన అందంగా చెప్పలేం.

Beauty Secrets Are For Women
Beauty Secrets : అందంగా కనిపించాలని చాలా మంది మహిళలు కోరుకుంటుంటారు. ముఖంలో చక్కటి గ్లో తో మెరిసిపోయేందుకు మార్కెట్లో లభించే అనేక చర్మ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి కాలుష్యం, చర్మ సంరక్షణలో సరైన పద్దతులు పాటించక పోవటం వంటి కారణాల వల్ల ముఖ చర్మం మెరుపును కోల్పోతుంది. మొటిమలు, మచ్చలు, ముడతలు లాంటి ఎన్నో సమస్యలు ముఖ అందానికి ఆటంగా మారతాయి.
చాలా మంది అందంగా కనిపిచేందుకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంటారు. బ్యూటీ పార్లర్ కు వెళ్ళే వాళ్లందరు అందంగా కనిపిస్తారనుకోవటం పొరపాటే అవుతుంది. వేసుకునే దుస్తులు, హెయిర్ స్టైల్, మేకప్ కారణంగా అందంగా కనిపించవచ్చు. అయితే ఇది సహాజ సిద్ధమైన అందంగా చెప్పలేం. అయితే ఈ చిన్న టిప్స్ పాటిస్తే చాలు.. చర్మం అందంగా మెరవటంతోపాటు నలుగురిలో మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు.
మహిళ కోసం బ్యూటీ సీక్రెట్స్ ;
1. చన్నీటితో అప్పుడప్పుడూ ముఖాన్ని కడుక్కుంటూ ఉండడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ముఖ చర్మాన్ని బిగుతుగా, మెరిసేలా చేస్తుంది. రోజుకు రెండు మూడు సార్లు చేయటం మంచిది. ముఖం కడిగేందుకు ఎక్కువ సార్లు సబ్బు ఉపయోగించటం మంచిదికాదని గుర్తించాలి.
2. ముఖం ఉబ్బినట్లుగా కనిపించినా, మొటిమలు ఉన్నా ఐస్ క్యూబ్ తీసుకుని ముఖంపై రబ్ చేయాలి. అదేపనిగా ప్రతిరోజు ఇలా చేయకూడదు. అప్పుడప్పుడు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. ముఖానికి పగటి సమయంలో ఫేస్ క్రీమ్ లేదా పౌడర్ వాడితే దాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా మేకప్ శుభ్రం చేసుకొని మాత్రమే నిద్రకు ఉపక్రమించాలి. ఇలా చేయటం వల్ల చర్మం పాడవ్వకుండా ఉంటుంది.
4.నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. ఇలా చేయటం వల్ల ముఖం కాంతి వంతంగా మారుతుంది.
5.నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ముఖ అందానికి మేలు కలుగుతుంది.
6.బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా నెలరోజుల పాటు చేస్తే చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది.
7.మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్ చేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
8.శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి చర్మం ఛామన చాయ వర్ణానికి వస్తుంది.
9. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. అలాగే ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
10.బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్ తగ్గుతుంది. గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.