Blackheads : చర్మంపై బ్లాక్ హెడ్స్ తొలగించే చిట్కాలు

చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.

Blackheads : చర్మంపై బ్లాక్ హెడ్స్ తొలగించే చిట్కాలు

Beauty Tips

Updated On : January 5, 2022 / 11:32 AM IST

Blackheads : చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి. బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ ను గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని కలిగిస్తాయి. బ్లాక్ హెడ్స్ ను తొలగించే కొన్ని చిట్కాలు మీకోసం..

1. తాజా కొత్తిమీర ఆకుల నుంచి తీసిన రసం ఓ టేబుల్‌స్పూన్, పసుపు అర టీ స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే కడుక్కోవాలి. ఇలా ఓ వారం చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగించుకోవచ్చు.

2. గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్ కలిపి ఆ పేస్ట్‌తో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.
నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాకు ఒక టీ స్పూన్ డెడ్‌సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. దీంతో చర్మాన్ని రుద్దుకుంటే చర్మంపై మచ్చలు తొలిగిపోతాయి.

3. మెంతి ఆకులను పేస్ట్‌లా దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. రోజు రాత్రి పడుకునే మందు ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. .

4. ఓ పావు కప్పు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, మూడు చుక్కల అయోడిన్ వేసి చల్లారేవరకు అలానే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంలో దూదిని ముంచి బ్లాక్‌హెడ్స్‌పై రాయాలి.

5. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది.

6. పొట్లకాయ గుజ్జును ముఖానికి రాయటం వల్ల మొటిమలు, ముడతలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ రావు.

7. ద్రాక్షపండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

8. ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా చర్మం నున్నగా అవుతుంది.

9. పెరుగులో నల్లమిరియాల పొడివేసి బాగా కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.