Tomato Soup : చలికాలంలో ఇన్ఫెఫెక్షన్లు దరిచేరకుండా…టమాటా సూప్

ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందు వల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి.

Tomato Soup : చలికాలంలో ఇన్ఫెఫెక్షన్లు దరిచేరకుండా…టమాటా సూప్

Tomato Soup

Updated On : December 20, 2021 / 11:35 AM IST

Tomato Soup : చలికాలంలో వచ్చే ఆరోగ్యసమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవటం ఎంతో అవసరం, జలుబు,దగ్గు,వంటి సమస్యలు ఈ కాలంలో సహజంగా అందరిని ఇబ్బందిపెడుతుంటాయి. అదేక్రమంలో తీవ్రమైన చలిని చాలా మంది తట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. చ‌లిని త‌ట్టుకోవాలంటే క‌చ్చితంగా ఈ సీజ‌న్‌కు త‌గిన‌ట్లుగా ఆహారాల‌ను తీసుకోవాల్సిందే. వాటిల్లో ట‌మాటా సూప్ ఒక‌టి. దీన్ని చ‌లికాలంలో తీసుకోవటం చాలా ఉత్తమం. రోజూ ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగ‌డం వ‌ల్ల ఎంతో లాభం క‌లుగుతుంది.

చలికాలంలో సహజంగానే రోగ నిరోధక శక్తి కొంచెం తక్కువగా ఉంటుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు వర్షాకాలంలోనే కాదు, ఇప్పుడు కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా పొగ మంచు రూపంలో అవి ఒకరినుంచి మరొకరికి వ్యాపించవచ్చు. అయితే నిత్యం ఉదయాన్నే ఒక కప్పు టమాటా సూప్ తాగితే అలాంటి ఇన్‌ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున టమాటా సూప్ తాగితే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా త‌గ్గుతాయి.

టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకు ఎంతగానో మంచిది. ఎముకలు విరిగి అతుక్కుంటున్న వారికి, కీళ్ల నొప్పులు ఉన్నవారికి టమాటా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం ఒక కప్పు సూప్ తాగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.టమాటా సూప్‌ను తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది అధిక బరువు ఉన్న వారికి ఎంతగానో మేలు చేసే విష‌యం. అందువ‌ల్ల వారు రోజూ ట‌మాటా సూప్‌ను తీసుకోవాలి.

ట‌మాటాల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపిస్తాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులును రాకుండా మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అందుకని టమాటాని నేరుగా తాగలేని వారు సూప్ గా తయారు చేసుకుని తాగడం మంచిది. లైకోపీన్, కెరోటినాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ట‌మాటాల్లో ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రావు. క్యాన్సర్ కణతులు కూడా వృద్ధి చెందవు. ప్రధానంగా వక్షోజ క్యాన్సర్, ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్ వంటివి ఉన్నవారు టమాటా సూప్‌ను తాగడం మంచిది.

రెండు వారాల పాటు టమాటా సూప్‌ను రోజూ తాగితే దాంతో మగవారిలో వీర్యం వృద్ధి అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. లైకోపీన్ వల్లే ఇది సాధ్యమవుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్ల పురుషులు శృంగార సామ‌ర్థ్యం పెరగాలంటే రోజూ ఒక క‌ప్పు ట‌మాటా సూప్‌ను తాగాల్సిందే. ట‌మాటా సూప్‌లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, విట‌మిన్లు ఎ, సి, కె, పొటాషియం, కెరోటినాయిడ్స్‌, లైకోపీన్ వంటి పోష‌కాలు ఉన్నాయి ఇవి వ్యాధుల బారిన పడకుండా చూస్తాయి చర్మానికి మంచి పోష‌ణ‌ను ఇస్తాయి. టమాటాల్లో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. కనుక మధుమేహం ఉన్న వారు టమాటా సూప్‌ను రోజూ తాగడం మంచిది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల టమాటా సూప్ తాగితే రక్త నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొలగిపోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. రక్తహీనత ఉన్నవారు టమాటా సూప్‌ను తాగితే మంచిది. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. దీంతో గుండె సమస్యలు రావు. హార్ట్ ఎటాక్ వంటివి రాకుండా చూసుకోవ‌చ్చు. ట‌మాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ ను నాశ‌నం చేసి క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. వాపుల‌ను త‌గ్గిస్తాయి.

ఎదిగే పిల్లలకు నిత్యం టమాటా సూప్‌ను ఇస్తే దాంతో రోజూ ఉత్తేజంగా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందు వల్ల నాడీ సంబంధ సమస్యలు పోతాయి. యాక్టివ్‌గా ఉంటారు. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలోనూ ట‌మాటా సూప్ మంచి పాత్రను పోషిస్తుంది. రోజూ క‌ప్పు మోతాదులో ట‌మాటా సూప్‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది.

టమాటా సూప్ తయారీ విధానం; ఇందుకు కావాల్సినవి..టమాటాలు- 8, మిరియాల పొడి ఒక టీ స్పూన్, కారం- ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టీ స్పూన్, నీళ్లు4 క‌ప్పులు, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. ముందుగా ప్రెష్ గా ఉన్న టమాటాలు తీసుకుని శుభ్రంగా కడిగి రెండు విజల్స్ వచ్చే వరకూ కుక్కర్ లో ఉడికించి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన అనంతరం వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీలో నాలుగు కప్పుల నీటిని కలిపి స్ట‌వ్‌ మీద పెట్టాలి. అది బాగా మారుతున్న సమయంలో మిరియాల పొడి, కారం, జీలకర్ర పొడి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం స్విమ్ లో పెట్టి.. మరికొంచెం సేపు మరిగించాలి. తర్వాత స్టౌ మీద నుంచి దింపి దానిలో పుదీనా వేసుకుని వేడివేడిగా బ్రేక్ ఫస్ట్ తో పాటు ఒక కప్ టమాటా సూప్ సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.