Samantha: నా ఆత్మగౌరవాన్ని బాక్సాఫీస్ నంబర్ల దగ్గర పడేశాను.. సమంత సంచలన కామెంట్స్
సౌత్ బ్యూటీ సమంత(Samantha) ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇప్పుడు టాప్ పొజిషన్ లో లేనని అలాగే, తన ఒక్క సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరలేదు.

Samantha's interesting comments about her past
Samantha: సౌత్ బ్యూటీ సమంత ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఇప్పుడు టాప్ పొజిషన్ లో లేనని అలాగే, తన ఒక్క సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరలేదు. అయినా కూడా తాను సంతోషంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? తాజాగా సమంత ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె(Samantha)మాట్లాడుతూ.. మయోసైటిస్ అనేది నా జీవితంలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలో తేల్చిచెప్పింది. దానితో నేను చేసిన పోరాటం నన్ను పూర్తిగా మార్చేసింది.
ఒకప్పుడు సక్సెస్ అంటే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అనే భావనలో ఉండే దాన్ని. ఇప్పుడే ఒకే ఆలోచన ఉండేది.. వరుసగా సినిమాలు చేయాలి, బ్లాక్ బస్టర్ అందుకోవాలి. టాప్ 10 హీరోయిన్స్ లిస్టులో ఉండాలి అని. కానీ, ఇప్పుడు నా ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. రెండేళ్లుగా సినిమా చేయలేదు, టాప్ 10 లిస్ట్‌లో లేను. అలాగే నాకు రూ.1000 కోట్ల సినిమాలు కూడా లేదు. అయినా కూడా చాలా ఆనందంగా ఉంటున్నాను.
ప్రతీ శుక్రవారం నాదే కావాలని ఒకప్పుడు భయపడేదాన్ని. నా ఆత్మగౌరవం మొత్తం బాక్సాఫీస్ నంబర్ల చుట్టూనే తీరుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ ఆలోచన లేదు. కొంత కాలంగా నా ఫాలోవర్స్ హెల్త్ పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నాను. ఆరోగ్యానికి సంబంధించిన ప్రతీ సమాచారం అక్కడ దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే సినిమా చేస్తున్నారు. దర్శకద్వయం రాజ్, డీకే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.