పోయినోళ్ల జ్ఞాపకాలను చెరపలేం : వాడని అకౌంట్ల తొలగింపుపై ట్విట్టర్

ఎప్పటికప్పుడూ కొత్త పాలసీలతో యూజర్లను బెదరగొట్టే మైక్రో బ్లాగింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ మనసు మార్చుకుంది. వినియోగంలో లేని ట్విట్టర్ అకౌంట్ల తొలగింపు నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసింది. ఏ ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేయాలో తెలియకపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ట్విట్టర్ పాలసీ ప్రకారం.. వినియోగంలో లేని అకౌంట్లను డిసెంబర్ 11, 2019 నాటికి డిలీట్ చేయాల్సి ఉంది.
డిలీట్ సరే.. వారి సంగతేంటి? :
వేలాది మంది యూజర్ల ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఉండి ఏళ్ల తరబడి యాక్సస్ చేయని అకౌంట్లపైనే ట్విట్టర్ ప్రధానంగా దృష్టిపెట్టింది. దీంతో వేలాది మంది యూజర్ల అకౌంట్లు, వారి ప్రొఫైల్స్ ఇప్పటికే పాలసీ ఉల్లంఘన చర్యల కింద అకౌంట్లను సస్పెండ్ చేస్తోంది. ఇదివరకే చాలామంది యూజర్ల అకౌంట్లను సస్పెడ్ చేస్తూ వచ్చిన ట్విట్టర్ సడన్ గా తమ అభిప్రాయాన్ని మార్చుకోవడంలో అంతరార్థం ఇదేనంటోంది.
వినియోగంలో లేని ట్విట్టర్ యూజర్ల అకౌంట్లలో చనిపోయిన వారి అకౌంట్లు కూడా ఉన్నాయి. ఆ విషయాన్ని గ్రహించలేని ట్విట్టర్ దూకుడుగా ఏదో పాలసీని తీసుకొచ్చి అకౌంట్లు డిలీట్ చేయాలనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.కానీ, వినియోగంలోని అకౌంట్లు డిలీట్ చేస్తారు.. సరే.. చనిపోయిన వారి అకౌంట్ల మాటేంటీ అని యూజర్లు గట్టిగా అడిగేసరికి ట్విట్టర్ నోరు వెల్లబెట్టింది.
చాలామంది యూజర్లు తమ అకౌంట్లను వినియోగించుకోలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కొంతమంది తమ పాస్ వర్డ్ మరిచిపోయి ఉండొచ్చు. లేదా మరో కొత్త ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉండొచ్చు. లేదంటే ట్విట్టర్ అకౌంట్లను క్రియేట్ చేసి వదిలివేయవచ్చు.
బంధాలను తెంచేస్తే ఎలా? :
వీరిలో చనిపోయిన వారి ట్విట్టర్ అకౌంట్లు కూడా ఎన్నో ఉంటాయి. అలాంటి వారి ట్విట్టర్ అకౌంట్లను ఫాలో అయినవారు కావొచ్చు. స్నేహితులు కావొచ్చ.. లేదా కుటుంబ సభ్యులు కావొచ్చు. బతికి ఉన్నంతకాలం వారితో సాగిన తీపి జ్ఞాపకాలను నెమరవేసుకునేందుకు చాలామంది ఆయా ట్విట్టర్ అకౌంట్లను విజిట్ చేస్తుంటారు.
వారితో గడిపిన ఆనాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ సంతోష పడుతున్నారు. నిజానికి ఓ రచయిత చనిపోయిన తన తండ్రి ట్విట్టర్ ఫీడ్ చూసేందుకు తరచుగా రీవిజిట్ చేసేవాడనినని చెప్పారు. తన దగ్గర అకౌంట్ క్రెడిన్షియల్స్ ఏమి లేవని, ఒకవేళ అకౌంట్ డిలీట్ చేస్తే.. తన తండ్రితో అనుబంధాన్ని తెంచేసినట్టే కదా? అని తన ట్విట్టర్‌లో అభిప్రాయపడ్డారు.
This impacts accounts in the EU only, for now. We’ve always had an inactive account policy but we haven’t enforced it consistently. We’re starting with the EU in part due to local privacy regulations (eg, GDPR).
— Twitter Support (@TwitterSupport) November 27, 2019
అవును. ఆయన చెప్పింది నిజమేనని అందరికి అనిపిస్తుంది. కొంతమంది చనిపోయిన వారు తమ అకౌంట్లను వినియోగించే అవకాశం లేదన్న విషయాన్ని ట్విట్టర్ మరిచిపోయినట్టుంది. దీనిపై స్పందించిన ట్విట్టర్.. సంచలన ప్రకటన చేసింది. చనిపోయిన యూజర్ల అకౌంట్లను గుర్తించేవరకు వినియోగంలో లేని అకౌంట్లను డిలీట్ చేయాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కనపెడుతున్నట్టు ప్రకటించింది.
ఫేస్ బుక్.. ట్విట్టర్‌లా కాదు :
ట్విట్టర్ తో పోలిస్తే ఫేస్ బుక్ కాస్త డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎప్పటినుంచో ఫేస్ బుక్ చనిపోయినవారి అకౌంట్ల ప్రొఫైల్స్ కనిపించేలా చూస్తోంది. వారి జ్ఞాపకాలను స్మరించుకునేలా అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి కొత్త కంటెంట్ యాడ్ చేయనప్పటికీ.. వారి ప్రొఫైల్ మాత్రం అలానే కనిపిస్తుంది. యూజర్లు తమ జీవితానికి సంబంధించి ఎన్నో ఫొటోలు, స్టోరీలను ఏళ్లపాటు షేర్ చేసి ఉంటారు. కానీ, ఫేస్ బుక్ ట్విట్టర్ మాదిరిగా కాదు.
అందుకు ప్రత్యేకమైన కారణమంటూ ఏది లేదు. అదే.. ట్విట్టర్ అసలైన నిర్ణయానికి ఇదే ప్రేరణగా చెప్పవచ్చు. చనిపోయినవారు వాడిన యూజర్ నేమ్స్.. ప్రస్తుతం వాడే కొత్త యూజర్లు వాడలేరు. ఎందుకంటే.. ఆయా అకౌంట్లన్నీ లాక్ అయి ఉంటాయి. ఒకవేళ మీరు ఏళ్ల తరబడి మీ ట్విట్టర్ అకౌంట్ వాడకుండా ఉంటే మాత్రం.. ఏదో ఒకరోజు మీ యూజర్ నేమ్ వదులుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతుంది.
ఇదేలా మరిచిందో :
ప్రతి పాత అకౌంట్లపై ట్విట్టర్ హక్కులు ఉంటాయి. ఆ అకౌంట్లను ట్విట్టర్ తొలగించవచ్చు. లేదా లాక్ చేయవచ్చు. కానీ, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? వాడకంలో లేని అకౌంట్లలో చనిపోయిన వారి అకౌంట్లు కూడా ఉంటాయని కంపెనీ గ్రహించలేకపోవడమే.చనిపోయిన కొందరి అకౌంట్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకునే వారెందరో తమకు విలువైనదిగా భావిస్తుంటారు.
అసలు.. చనిపోయిన వారి అకౌంట్ ఎలా పరిగణిస్తారు.. అది ఎలా పనిచేస్తుందనే దానిపై కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అందుకే ట్విట్టర్ అకౌంట్లను తొలగించాలనే ఆలోచనను హోల్డ్ లో పెట్టింది. తన తప్పును తెలుసుకున్న ట్విట్టర్ కంపెనీ ఇలాంటి ఎన్నో విషయాల పట్ల మరిచిపోతోనే ఉంది.