Coffee For Health : రోజుకు రెండు కప్పులు చాలు ! అధిక మోతాదులో తాగితే మాత్రం నరాల బలహీనతతోపాటు, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం?

కాఫీ తాగడం మరియు ఆయుర్దాయం మధ్య సానుకూల సంబంధం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వివిధ కారణాల వల్ల కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. కాఫీలో రెటీనా క్షీణత నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడే క్లోరోజెనిక్ ఆమ్లాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది.

Coffee For Health : రోజుకు రెండు కప్పులు చాలు ! అధిక మోతాదులో తాగితే మాత్రం నరాల బలహీనతతోపాటు, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం?

Two cups a day is enough! If you drink in high doses, along with nerve weakness, the risk of eye diseases?

Updated On : October 21, 2022 / 7:00 AM IST

Coffee For Health : రోజువారిగా తీసుకునే పానీయాల్లో మంచి నీరు ప్రధానమైనదైతే తరువాత స్ధానంలో టీ, కాఫీలే ఉంటాయి. ముఖ్యంగా కాఫీ విషయానికి వస్తే చాలా మంది నిద్రలేవగానే బెడ్ కాఫీతోనే తమ దినచర్యను ప్రారంభిస్తారు. వారికి అది అలవాటుగా మారిపోతుంది. అది తాగనిదే ఉండలేని పరిస్ధితికి చేరుకుంటారు. అందులో ఉండే కెఫిన్ వారిని అంతలా కాఫీకి అలవాటుపడేలా చేస్తుంది. ఇది మానవ శరీరంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. కాఫీలో కెఫిన్ తోపాటు ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి వివిధ ఖనిజాలు ఉంటాయి. సాధారణంగా కాఫీలో ఫిల్టర్‌కాఫీ, ఇన్‌స్టాంట్‌ కాఫీ, అన్‌ఫిల్టర్డ్‌/బాయిల్డ్‌ కాఫీ వంటి రకాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో వచ్చిన కొత్త ట్రెండ్ లో విభిన్న శైలిలో కాఫీలను తయారు చేస్తున్నారు. అయితే దీని వల్ల శరీరానికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

కాఫీ కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర సేంద్రీయ సమ్మేళనాల యొక్క గొప్ప మూలం. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడానికి సహాయపడుతుంది. డోపామైన్ హార్మోన్ మీద కాఫీ ప్రభావం వల్ల, కాఫీ వినియోగం మూర్ఛరోగాలను నివారించడంలో సహాయపడుతుంది. రోజుకు 2 కప్పుల కాఫీ తాగడం వల్ల మీ గుండె జబ్బులు, పక్షవాతం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కాఫీ తాగే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 10% వరకు తగ్గిస్తుంది. ఇది కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కాఫీ తాగడం మరియు ఆయుర్దాయం మధ్య సానుకూల సంబంధం ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. వివిధ కారణాల వల్ల కాఫీ తాగడం వల్ల మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. కాఫీలో రెటీనా క్షీణత నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడే క్లోరోజెనిక్ ఆమ్లాలు అధిక స్థాయిలో ఉన్నాయని పరిశోధనలో తేలింది. నోటిలో బ్యాక్టీరియాను చంపి దంతక్షయాన్ని నివారించే సామర్ధ్యం కలిగి ఉందని వైద్య అధ్యయనంలో తేలింది.

కాఫీలో కెఫిన్‌తో ఆరోగ్యంపై ప్రభావమిలా ;

1.కాఫీలో ఉండే కెఫిన్‌ అనే ఉత్ప్రేరక పదార్థం. మనం కాఫీ తాగి తాగగానే… దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్‌జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్‌ ప్రెషర్‌ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

2. కాఫీలో మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్‌’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. అలా గ్యాప్‌ ఇవ్వకుండా మరో కాఫీ తాగి ఏదైన సమస్యకు సంబంధించిన మందులు మింగితే సెడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయి.

3. కాఫీ యాంగ్జైటీని మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది. నరాల బలహీనతను తెచ్చిపెడుతుంది.

4. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత కంటిలో నీటికాసుల సమస్య అనే కంటి వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది.

5. కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, ఇది అజీర్ణం, గుండెపోటు మరియు తలనొప్పి వంటి వివిధ సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలో తేలింది.