Distraction : తెలియని పరధ్యానమా! దాని నుండి బయటపడటం ఎలా?

పరధ్యానం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను ఇంట్లో చులకనగా మాట్లాడటం వంటి కారణాల వల్ల వారిలో తెలియని పరధ్యానానికి దారితీసే అవకాశం ఉంటుంది.

Distraction : తెలియని పరధ్యానమా! దాని నుండి బయటపడటం ఎలా?

Distraction

Updated On : June 12, 2022 / 6:56 AM IST

Distraction : మనిషి ఇక్కడ ఉంటే అతని మనస్సు ఎక్కడో ఆలోచిస్తుంటుంది. తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కనీసం పట్టించుకునే పరిస్ధితి ఉండదు. ఇలాంటి పరిస్ధితినే పరధ్యానంగా చెప్పవచ్చు. సాధారణంగా ధ్యానంలో ఉంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అదే పరధ్యానంలో ఉంటే మాత్రం అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అనేక మంది వ్యక్తుల్లో ఈసమస్య ఉంటుంది. అన్ని వయస్సులు వారు దీనికి అతీతులు కారు. ఆరోగ్యంగా ఉన్నవారిని సైతం ఇది ఆవహిస్తుంది. దీనిని మానసిక వ్యాధిగా చెప్పలేము.

పరధ్యానంతో వ్యవహరించే వారు సున్నిత స్వభావం కలి ఉండటంతోపాటు, ఎక్కువగా తమ ఊహాలోకంలో విహరిస్తూ వివిధ రకాల ఆలోచనలు చేస్తూ, తమలో తామే మాట్లాడుకోవటం వంటివి చేస్తుంటారు. మెతకతనం, నెమ్మదస్తులై తమ చుట్టు ఏం జరిగినా పెద్దగా వారు పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటారు. తమలోపలి భావాలను ఇతరులకు పంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు.

పరధ్యానం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలను ఇంట్లో చులకనగా మాట్లాడటం వంటి కారణాల వల్ల వారిలో తెలియని పరధ్యానానికి దారితీసే అవకాశం ఉంటుంది. పరిస్ధితులు తమకు అనుకూలంగా లేవన్న ఆలోచనలతో వారు పరధ్యానంలో పడిపోతారు. మానసిక ఒత్తిడికి లోనైన సందర్భంలో, అతిగా అలోచించే సందర్భంలో పరధ్యానాన్ని పిల్లల్లో గమనించవచ్చు. వ్యాపారాలు, వృత్తి, ఉద్యోగాలు, ఇంటి పనులు, పిల్లల పనులు, ఉద్యోగినులైతే ఆఫీస్ పనులు ఇలా ఒకేసారి రకరకాల పనులు చేసేవారిలో అయోమయం నెలకొంటుంది. దీంతో గందరగోళానికి లోనై పరధ్యానంలోకి వెళతారు. దీనిని మతిమరుపుగా చెప్పలేం.

పరధ్యానం నుండి బయటపడేందుకు మనస్తత్వ నిపుణులను సంప్రదించి వారి సూచనలు , సలహాలు తీసుకోవాలి. ప్రతిరోజు తాము ఏంచేస్తున్నమన్న విషయాలను ఒక డైరీ రూపంలో పొందు పరుచుకోవటం అవసరం. ఇష్టమైన పనులు చేయటం మంచిది. పనిపై ఏకాగ్రత పెంచుకోవటానికి కొన్ని రకాల వ్యాయామాలు , ఫజిల్స్ దోహదపడతాయి. పాజిటివ్ దృక్పధాన్ని అలవాటు చేసుకోవాలి. ఏరోజుకారోజు చేయాల్సిన పనుల జాబితాను ముందుగానే రూపొందించుకుని ప్రణాళిక ప్రకారం వాటిని పూర్తి చేసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు పరధ్యానంలో ఉన్నట్లు గమనిస్తే వెంటనే వారిని దాని నుండి బయటపడేసేందుకు తగిన శ్రద్ధ తీసుకోవాలి.