Aluminum Foil : ఆహారాన్ని నిల్వవుంచటంకోసం అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త!
అల్యూమినియం కవర్లలో ఆహారాన్ని5 గంటల కంటే ఎక్కువసేపు ఉంచడం హానికరం. అల్యూమినియం ఫాయిల్‌లో మిగిలిపోయిన ఫుడ్‌ని నిల్వ చేయటం వల్ల లోపలే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది.

Using aluminum foil for food storage? But beware!
Aluminum Foil : ఆహారాన్ని నిల్వ చేయటానికి ఈ మధ్యకాలంలో అల్యూమినియం కవర్స్ వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ కవర్స్‌లో ఆహారాన్ని ప్యాక్ చేయడం వల్ల చాలా కాలం పాటు తాజాగా, వేడిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అల్యూమినియం ఫాయిల్‌లో స్వచ్ఛమైన అల్యూమినియం ఉండదు. ఇందులో మిక్స్‌డ్ మెటల్‌ని ఉపయోగిస్తారు. అల్యూమినియం ఫాయిల్‌ను తయారు చేయడానికి ముందుగా అల్యూమినియం కరిగించి, రోలింగ్ మిల్ అనే ప్రత్యేక రకం యంత్రంలో తయారు చేస్తారు.
అల్యూమినియం కవర్లలో ఆహారాన్ని5 గంటల కంటే ఎక్కువసేపు ఉంచడం హానికరం. అల్యూమినియం ఫాయిల్‌లో మిగిలిపోయిన ఫుడ్‌ని నిల్వ చేయటం వల్ల లోపలే బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఒక రోజు తరువాత ఆహారం పాడవుతుంది. అందుకే ఫాయిల్ కంటెయినర్స్‌లో స్టోర్ చేయడం, ఆ పేపర్ అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాలిక్, సెలైన్ తో పోలిస్తే ఇది ఆమ్ల, సజల ద్రావణాలలో గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. అల్యూమినియం ఫాయిల్ హై టెంపరేచర్ పరిస్థితుల్లో నిల్వవుంచే ఆహారాలలో లోహం కలిసేందుకు అవకాశం ఉంటుంది.
అల్యూమినియం ఫాయిల్స్‌కు బదులుగా పింగాణీ, సెరామిక్ వంటి వస్తువులలో ఆహారాన్ని పెట్టవచ్చని, వాటితో ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు సూచిస్తున్నారు. అల్యూమినియం ఫాయిల్స్ లో నిల్వ చేసిన ఆహారాలను తినటం వల్ల అల్జీమర్స్, ఎముకల సంబంధ వ్యాధులు, మూత్రశాయ అనారోగ్యాలు, మెదడు కణాల పనితీరు దెబ్బతినడం వంటి వ్యాధులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది.